నాగబాబు, రోజా: జబర్దస్త్ కాంబినేషన్ కు పొలిటికల్ బ్రేక్

Published : Apr 09, 2019, 03:38 PM IST
నాగబాబు, రోజా: జబర్దస్త్ కాంబినేషన్ కు పొలిటికల్ బ్రేక్

సారాంశం

ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరు షోకి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తాత్కాలికంగానే వీరు షోకి దూరమయ్యారని కొందరు అంటుంటే.. లేదు శాశ్వతంగానే షోకి దూరమయ్యారనే వాదనలు కూడా వినపడుతున్నాయి.


నాగబాబు, రోజా.. పరిచయం అక్కర్లేని రెండు పేర్లు. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందినవారే. ఒకరు పాపులర్ హీరోయిన్ అయితే.. మరొకరు సినీ నిర్మాతగా, సహనటుడిగా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరికీ సెపరేట్ గా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించలేదు కానీ... .. జబర్దస్త్ అనే టీవీ షో కి కలిసి పనిచేశారు.

ఒకటి కాదు, రెండు కాదు దాదాపు  7 సంవత్సరాలు వీరిద్దరూ కలిసి జబర్దస్త్ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు కూడా. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికలు ఇప్పుడు వీరిద్దరినీ విడదీశాయి. ప్రస్తుతానికి వీరిద్దరూ ఈ షో నుంచి దూరంగా వచ్చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరు షోకి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తాత్కాలికంగానే వీరు షోకి దూరమయ్యారని కొందరు అంటుంటే.. లేదు శాశ్వతంగానే షోకి దూరమయ్యారనే వాదనలు కూడా వినపడుతున్నాయి.

అంతేకాదు.. ఏపీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేస్తున్నారు. రోజా వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే.. నాగబాబు జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో కనుక వీరిద్దరూ విజయం సాధిస్తే... రాజకీయాల్లో పూర్తి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కలిసి ఉన్న ఈ ఇద్దరూ శాశ్వతంగా విడిపోయే పరిస్థితి అంటే.. కలిసి ప్రేక్షకులకు కనిపించే అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా