మా అన్నయ్య చోటా రాజన్, అల్లు అరవింద్ దావూద్ ఇబ్రహీం: నాగబాబు కామెంట్స్!

By Udaya DFirst Published Feb 12, 2019, 12:51 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురి చేతుల్లోనే ఉంటుందని, చిన్న సినిమాలను వారు తోక్కెస్తుంటారని.. థియేటర్లు దొరకనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటారనిటాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇదే విషయంపై సినీ నటుడు నాగబాబుని ప్రశ్నించింది మీడియా. 

సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురి చేతుల్లోనే ఉంటుందని, చిన్న సినిమాలను వారు తోక్కెస్తుంటారని.. థియేటర్లు దొరకనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటారనిటాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇదే విషయంపై సినీ నటుడు నాగబాబుని ప్రశ్నించింది మీడియా.

అన్ని ఇష్యూల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తాను వచ్చిన సినీ రంగం గురించి ఎందుకు మాట్లాడరనే ప్రశ్నకి సమాధానంగా... ''అక్కినేని ఫ్యామిలీ, మెగాఫ్యామిలీ, సురేష్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఈ నలుగురు.. ఒకవైపు దిల్ రాజు మరో వైపు అల్లు అరవింద్ గారు.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు. ఇంతకంటే పెద్ద మాఫియా ఎవరుంటారు. మేమే పెద్ద మాఫియా. అరవింద్ గారు ఓ దావూద్ ఇబ్రహీం. మా అన్నయ్య చోటా రాజన్, లేదంటే సురేష్ బాబు చోటా రాజన్. ఇవన్నీ పిచ్చి ఆరోపణలు, పిచ్చి మాటలు'' అంటూ చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ కంట్రోల్ చేయలేరని, చిన్న సినిమాలు రిలీజ్ కాకపోవడమనేది డిస్ట్రిబ్యూటర్ లకు సంబంధించిన విషయమని అన్నారు. ఈ నలుగురు చేతుల్లోనే మొత్తం గ్రిప్ ఉంటుందని అనుకుంటే మరి మాకు ఫ్లాప్ లు ఎందుకొస్తాయని అన్నారు. వారి చేతిల్లో ఎలాంటి పవన్ ఉండదని,ఇండస్ట్రీలోఎవరికి డిమాండ్ ఉంటుందో వాళ్లే పైకి వస్తారని అన్నారు.

పెద్ద సినిమాలు విడుదలయ్యే సీజన్ లోనే చిన్న సినిమాలు కూడా విడుదల చేయాలని అనుకుంటారని, డిస్ట్రిబ్యూటర్లు ఏ సినిమాకి డిమాండ్ ఉంటే దాన్నే తీసుకుంటారని.. కెపాసిటీ ఉన్న సినిమాలే ఆడతాయని అన్నారు. నేటి రోజుల్లో పెద్ద సినిమాలు కూడా నెల రోజులు ఆడితే గొప్ప అంటూ వెల్లడించారు.     

click me!