Naga Shurya : కొత్త అవతారం ఎత్తిన నాగశౌర్య.. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్

Published : Jan 22, 2022, 02:23 PM IST
Naga Shurya : కొత్త అవతారం ఎత్తిన నాగశౌర్య.. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్

సారాంశం

యమా దూకుడు మీద ఉన్నాడు యంగ్ స్టార్ నాగశౌర్య(Naga Shurya). గెలుపు ఓటములు లెక్క చేయకుండా వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. నాన్ స్టాప్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా మరో కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు శౌర్య,

యమా దూకుడు మీద ఉన్నాడు యంగ్ స్టార్ నాగశౌర్య(Naga Shurya). గెలుపు ఓటములు లెక్క చేయకుండా వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. నాన్ స్టాప్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా మరో కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు శౌర్య,

లాస్ట్ ఇయర్ నాగశౌర్య(Naga Shurya) కష్టపడి చేసిన వరుడు కావలెను, లక్ష్య రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయినా సరే నిరాశపడకుండా పట్టువదలని విక్రమార్కుడిలా..వరుసగా మూవీస్ సెట్స్ ఎక్కిస్తున్నాడు టాలీవుడ్ యంటగ్ స్టార్ నాగశౌర్య(Naga Shurya). అంతే కాదు ప్రయోగాలు చేయడం కూడా మానలేదు శౌర్య. ఎప్పటికప్పుడు స్క్రీన్ పై కొత్తగా కనిపించేలా ప్లాన్ చేసుకుంటన్నాడు. ఈసారి కూడా అదే ఫార్ములా అప్లై చేశాడు.

నాగశౌర్య(Naga Shurya)  హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నాగశౌర్య స్వయంగా  ఈ సినిమా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ  సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కృష్ణ వ్రింద విహారి అనే టైటిల్ ను ఖరారు చేశారు.నాగశౌర్య  బర్త్ డే గిఫ్ట్ గా.. ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను వదిలారు.
 
కృష్ణ వ్రింద విహారి అనే టైటిల్ ను డిఫరెంట్ గా  డిజైన్ చేశారు టీమ్. ఈ టైటిల్ తో సినిమా స్టోరీ కూడా అర్ధం అయ్యేలా ఉంది. కృష్ణ .. వ్రింద .. విహారి అనే ముగ్గురి మధ్య నడిచే ప్రేమకథ అనే విషయం అర్థమవుతుంది. అంటే ఒక హీరో .. ఇద్దరు హీరోయిన్ల చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇక నాగశౌర్య లుక్ చూస్తుంటే.. సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన కుర్రాడిలా నాగశౌర్య (Naga Shurya)కొత్తగా కనిపించాడు. చేతిలో చెంపు నీళ్ళతో.. ఆకులతో నీళ్లు చల్లుకుంటూ.. సరికొత్తగా మేక్ ఓవర్ అయ్యాడు శౌర్య.

నాగశౌర్య (Naga Shurya)జోడీగా షిర్లే సెటియా కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కొంతకాలంగా నాగశౌర్య(Naga Shurya) వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ప్రయోగాలు అచ్చి రావట్దు యంగ్ హీరోకి. అయినా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే  రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. మరి వీటిలో ఈ కొత్త ఏడాది అయినా కలిసొచ్చి.. ఒక్క సినిమా అయినా హిట్ పడుతుందో లేదో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్