బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్, దివంగత హీరో ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ను తన జయంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ గుర్తు చేసుకున్నారు.
బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్, దివంగత హీరో ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ను తన జయంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుశాంత్ కు నివాళి అర్పిస్తూ.. ఆయనతో వారికి ఉన్న ఫ్రెండ్ షిప్ ను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
నటుడిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ప్రముఖ నటుడు, దివంగత ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ’ ఒకరు. అయితే అయిన పుట్టిన రోజు సందర్భంగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ తమ నివాళిని అర్పించారు. రాజ్ పుత్ జీవించి ఉంటే ఈ రోజుతో 36 ఏండ్లు నిండేవని తెలిపారు.
అనుష్క శర్మ, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పుట్టినరోజు సందర్భంగా తమ సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. సుశాంత్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడో తమ అభిమానులతో పంచుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడంలో సుశాంత్ ఎంతో శ్రద్ధ వహించేవారన్నారు. ఆయన తో కలిసి సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్లు సుశాంత్ ను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
అలాగే బాలీవుడ్ ప్రముఖులు కూడా వారి సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు నివాళి అర్పించారు. భూమి పెడ్నేకర్ సుశాంత్ తో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫొటోలోతెల్లటి చొక్కాలో సుశాంత్ సంతోషంగా నవ్వుతూ కనిపించాడు. ఈ ఫొటోకు ఆమె వైట్ హార్ట్ ఎమోజీని జోడించి "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జ్ఞాపకార్థం" అని క్యాప్షన్ ఇచ్చింది . 2019లో విడుదలైన ‘సోంచిరియా’ చిత్రంలో వీరిద్దరూ కలిసి పనిచేశారు.
ఇక, కంగనా రనౌత్ కూడా సుశాంత్‌ను "ఆకాశంలో నక్షత్రం" అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా తన నివాళిని అర్పించింది. 2019 బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'ఛిచోరే'లో సుశాంత్ తో కలిసి పనిచేసన నటి శ్రద్ధా కపూర్ కూడా ఇన్స్టా గ్రామ్ స్టోరీలో సుశాంత్ నవ్వుతున్న చిత్రాన్ని పంచుకుంది.
ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'గెహ్రైయాన్' ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రశంసలు అందుకుంటున్న సిద్ధాంత్ చతుర్వేది కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో దివంగత స్టార్‌ను గుర్తు చేసుకున్నారు. ట్రైలర్ గురించి బాలీవుడ్ తారల నుండి వచ్చిన రెస్పాన్స్ ను తెలిపాడు. తర్వాత సుశాంత్ నవ్వుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు. చిత్రాన్ని పంచుకున్నాడు మరియు "ఈ ఒక్క స్పందనను మిస్ అవుతున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు భాయ్" అని రాశాడు.
సంజనా సంఘి కూడా తాను, సుశాంత్ కలిసి డ్యాన్స్ చేసిన 'దిల్ బెచార' నుండి ఒక స్టిల్‌ను షేర్ చేసింది. 'దిల్ బెచార' దర్శకుడు ముఖేష్ ఛబ్రా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ నివాళులను అర్పిస్తూ ఫొటో షేర్ చేశారు. సుశాంత్ చివరిగా వెండితెరపై 'చిచ్చోరే'లో శ్రద్ధా కపూర్‌తో కలిసి నటించారు. ఆయన మరణించిన ఒక నెల తర్వాత అతని చివరి చిత్రం 'దిల్ బెచార' డిజిటల్‌గా విడుదలైంది.