మధ్యలో ఆగిపోయిన 'ఛలో' హీరో మూవీ

Published : Apr 12, 2019, 09:37 PM ISTUpdated : Apr 12, 2019, 09:40 PM IST
మధ్యలో ఆగిపోయిన 'ఛలో' హీరో మూవీ

సారాంశం

ఛలో సినిమాతో చాలా రోజుల తరువాత హిట్టందుకున్న నాగ శౌర్య ఆ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను పెంచేసుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన ప్రాజెక్ట్స్ నాగ శౌర్య ను కొంచెం గట్టిదెబ్బే కొట్టాయి. 

ఛలో సినిమాతో చాలా రోజుల తరువాత హిట్టందుకున్న నాగ శౌర్య ఆ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను పెంచేసుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన ప్రాజెక్ట్స్ నాగ శౌర్య ను కొంచెం గట్టిదెబ్బే కొట్టాయి. ఇక ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో హీరో కెరీర్ కు మరో దెబ్బ పడినట్లయింది. 

ప్రొడ్యూసర్ ఆనంద ప్రసాద్ ప్రొడక్షన్ లో నూతన దర్శకుడు రాజా కొలుసు కొన్ని నెలల క్రితం ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. నాగ శౌర్యకు జోడిగా తెలుగమ్మాయి ఈషా రెబ్బను కూడా ఫైనల్ చేశారు. అయితే సినిమా సాఫీగా సాగుతోంది అనుకున్న సమయంలో చిత్ర యూనిట్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సినిమాను ఆపేసినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతన నాగ శౌర్య రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి సుకుమార్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోంది.  

PREV
click me!

Recommended Stories

Peddi 13 Days Collections: మూడో వారంలో పెద్ది ఊహించని డ్రాప్‌, అయినా బాక్సాఫీసు వద్ద రామ్‌ చరణ్‌ ర్యాంపేజ్‌
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు