110కోట్లు రాబడితే ప్లాప్ అన్నారు.. ఆడియెన్స్ పై సల్మాన్ హాట్ కామెంట్స్

Published : Apr 12, 2019, 08:30 PM IST
110కోట్లు రాబడితే ప్లాప్ అన్నారు.. ఆడియెన్స్ పై సల్మాన్ హాట్ కామెంట్స్

సారాంశం

రీసెంట్ గా ట్యూబ్ లైట్ సినిమా గురించి స్పందించిన సల్మాన్ ఆడియెన్స్ ఆ సినిమాను ఎందుకు తప్పుబట్టారో అర్ధం కాలేదని కొంచెం హాట్ కామెంట్స్ చేశాడు. 

సల్మాన్ కెరీర్ లో డిజాస్టర్స్ చాలా తక్కువ. నెగిటివ్ కామెంట్స్ ఎన్ని తెచ్చుకున్నా కూడా కమర్షియల్ గా సల్మాన్ పెద్దగా నష్టపోలేదు. హిట్టయితే నిర్మాతలకు కాసుల వర్షమే. లేకుంటే పెట్టుబడి వెనక్కి వస్తుంది. బాలీవుడ్ బిజినెస్ లో సల్మాన్ కి ఉన్న పట్టు ఇదే. 

అయితే రీసెంట్ గా ట్యూబ్ లైట్ సినిమా గురించి స్పందించిన సల్మాన్ ఆడియెన్స్ ఆ సినిమాను ఎందుకు తప్పుబట్టారో అర్ధం కాలేదని కొంచెం హాట్ కామెంట్స్ చేశాడు. 

బజరంగీ భాయి జాన్ సినిమా అనంతరం పండగ సమయంలో ఒక మంచి సినిమాను అందించాలని ట్యూబ్ లైట్ సినిమా చేశాను. అయితే పండగ సమయంలో ఆనందాన్ని ఇచ్చే సినిమాను చూడాలనుకున్న ఆడియెన్స్ కి ఆ సినిమా చూసాక ఏడుపొచ్చింది. దీంతో ఈ టైమ్ లో ఈ ఏడుపు సినిమా ఏమిటని పండగను నాశనం చేశాడని నన్ను తిట్టుకున్నారు. 

కొంత మంది డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయారు. కానీ ట్యూబ్ లైట్ సినిమా డిజిటల్ వరల్డ్ లో పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. టీవీల్లో రేటింగ్ కూడా అద్భుతంగా ఉంది. చాలా సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటే 100కోట్లు కూడా రాబట్టలేవు. కానీ నేను అదృష్టవంతుడిని. ట్యూబ్ లైట్ సినిమా ఈజీగా 110కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటిది ఆడియెన్స్ సినిమాకు ప్లాప్ ముద్ర వేయడం విచిత్రంగా ఉందని సల్మాన్ వివరణ ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?