Liger Movie Update : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘లైగర్’ నుంచి క్రేజీ అప్డేట్..

Published : Mar 26, 2022, 10:54 PM IST
Liger Movie Update : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘లైగర్’ నుంచి క్రేజీ అప్డేట్..

సారాంశం

రౌడీ హీరో విజయదేవరకొండ (Vijay Deverakonda) తాజాగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ మూవీ కోసం రౌడీ ఫ్యాన్స్ ఇప్పటికే వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ అందింది.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న చిత్రం ‘లైగర్’ Liger. ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. అందుకు తగట్టుగానే మూవీ నుంచి గతంలో వచ్చిన పోస్టర్స్, గ్లిమ్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో  వచ్చే అప్డేట్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ ను విజయ్ దేవరకొండ పోషిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ఆడిపాడనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లైగర్ మూవీలో భాగస్వామిగా ఉన్నారు. మణిశర్మ లైగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.   

అయితే, పూరీ జగన్నాథ్ ఏ స్టార్ హీరోతో సినిమా తీసినా ఆరునెలలు తిరగకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. కానీ ఆయన కేరీర్ లోనే  లైగర్ మూవీ ఫస్ట్ టైం చాలా ఆలస్యంగా రిలీజ్ అవుతోంది. అయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్ 19 థర్డ్ వేవ్, ఏపీలోని టికెట్ల ధరలు లాంటివని చెప్పొచ్చు. ఏదేమైనా 2020 జనవరిలో ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించి 40 రోజులు రెగ్యూలర్ షూటింగ్ ను కొనసాగించారు. ఆ తర్వాత కోవిడ్ పరిస్థితుల కారణంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్ 15న మళ్లీ ప్రారంభించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది.

లైగర్ షూటింగ్ పూర్తి చేసుకొని  దాదాపు నెలరోజులు గడిచింది. ఇప్పటికీ ఎలాంటి అప్టేడ్ అందలేదు. ఒకవైపు పెద్ద సినిమాలన్నీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరోవైపు లైగర్ ను ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. ‘త్వరలో చాలా ఉత్తేజకరమైన విషయం రాబోతోంది..  చూస్తూ ఉండండి అబ్బాయిలు. అందరి అడ్రినలిన్ రష్ ని రైజ్ చేసే అప్డేట్ రిలీల్ చేయబోతున్నాం,’ అంటూ చార్మి కౌర్ (Charmme Kaur) తన ట్వీట్ ద్వారా పేర్కొంది.  

 

ఇక ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందో.. ఇంతకీ ఎలాంటి అప్డేట్ తో మేకర్స్ సర్ ప్రైజ్ చేయనున్నారోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Mike Tyson) కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ‘లైగర్’ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఇక విజయ్, పూరీ నెక్ట్ మూవీ ‘జనగమన’ కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌