ఇంట్రస్టింగ్ గా ...'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' రిలీజ్ ట్రైలర్ !

Published : Mar 16, 2023, 01:35 PM IST
 ఇంట్రస్టింగ్ గా ...'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి'  రిలీజ్ ట్రైలర్ !

సారాంశం

మళ్లీ ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్ల కలయికలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే న్యూఏజ్‌ లవ్‌స్టోరీ తెరకెక్కింది. ఇది తలకెక్కి జనాల్లోకి ఎక్కుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.  


శ్రీనివాస్‌ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్‌  కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానందా’ సినిమాలు కల్ట్‌ క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించకపోయినా.. గుర్తుండిపోయే సినిమాలు ఇవి.  ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్ల కలయికలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే న్యూఏజ్‌ లవ్‌స్టోరీ తెరకెక్కింది. ఇది తలకెక్కి జనాల్లోకి ఎక్కుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌, పాటలు ఇలా ప్రతీది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై మంచి బజ్‌ యే ఉంది. కాగా తాజాగా మేకర్స్‌ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌లోనే సినిమా స్టోరీని చెప్పేశారు. వివిధ వయసుల్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఏ విధంగా ఉండబోతుందో అని సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్‌తోనే స్పష్టం చేశారు. తాజగా రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
హీరోను అనుమానించే ఒక సీన్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ .. పెళ్లి .. అలకలు .. బుజ్జగింపులను కలుపుకుంటూ వెళ్లే కథలా ఈ సినిమా కనిపిస్తోంది.  కల్యాణి మాలిక్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే బాగా పాప్యులర్ అయ్యాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ అవసరాల మార్క్ మూవీ కావడంతో, టైటిల్ దగ్గర నుంచే పాజిటివ్ బజ్ మొదలైంది. 

కళ్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా సునీల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్‌ నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై టీ.జి విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక మార్చి 17న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.  
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ