శ్రీజ కల్యాణ్ బేబి2 #లోడింగ్..!

Published : Nov 06, 2018, 10:14 AM IST
శ్రీజ కల్యాణ్ బేబి2 #లోడింగ్..!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. చాలా కాలంగా రామ్ చరణ్-ఉపాసనల నుండి ఈ శుభావార్త విందామని అభిమానులు ఎదురు చూస్తుంటే.. వారు మాత్రం కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు చిరు తాత ఎలా కాబోతున్నారంటే ఆయన రెండో కూతురు శ్రీజ ఇప్పుడు గర్భవతి. 

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. చాలా కాలంగా రామ్ చరణ్-ఉపాసనల నుండి ఈ శుభావార్త విందామని అభిమానులు ఎదురు చూస్తుంటే.. వారు మాత్రం కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఇప్పుడు చిరు తాత ఎలా కాబోతున్నారంటే ఆయన రెండో కూతురు శ్రీజ ఇప్పుడు గర్భవతి. ఆ విషయాన్ని తన భర్త కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'శ్రీజ కల్యాణ్ బేబి2 #లోడింగ్' అంటూ అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తన మొదటి భర్తతో విడిపోయిన తరువాత కళ్యాణ్ కనుగంటి అనే వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. శ్రీజకి ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు నివ్రితి.

మొదటి భర్తకి పుట్టిన కూతురైన కళ్యాణ్ ఆ పాపని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇప్పుడు ఈ జంటకి ఓ బిడ్డ పుట్టనుండడంతో  మెగాఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది! 

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: చెరో నెక్లెస్ కొట్టేసిన ఐశ్వర్య, భ్రమరాంబ, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్