చైతూ నెక్ట్స్ డిఫరెంట్‌ సర్‌ప్రైజ్‌..

Published : Aug 20, 2020, 01:49 PM IST
చైతూ నెక్ట్స్ డిఫరెంట్‌ సర్‌ప్రైజ్‌..

సారాంశం

ప్రస్తుతం నాగచైతన్య నటించిన `లవ్‌ స్టోరి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. పూర్తి ప్రేమ కథా చిత్రంగా ఇది రూపొందింది. దీంతోపాటు మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్‌లో పెట్టారు నాగచైతన్య. 

పాత్ర కోసం విభిన్న గెటప్స్ లో కనిపించేందుకు హీరోలు వెనకాడటం లేదు. ఇటీవల ఇలాంటి ట్రెండ్‌ బాగా పెరుగుతుంది. తాజాగా యువ సామ్రాట్‌ నాగచైతన్య సైతం ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. తన నెక్ట్స్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడట. ఆ విషయం తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య నటించిన `లవ్‌ స్టోరి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. పూర్తి ప్రేమ కథా చిత్రంగా ఇది రూపొందింది. దీంతోపాటు మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్‌లో పెట్టారు నాగచైతన్య. 

అందులో ఒకటి దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే విక్రమ్‌ అక్కినేని ఫ్యామిలీలో మూడు తరాల హీరోలతో `మనం` సినిమా తెరకెక్కించి టాలీవుడ్‌కి ఓ క్లాసిక్‌ని అందించారు. ఆ తర్వాత అఖిల్‌ హీరోగా `హలో` చిత్రాన్ని రూపొందించగా, అది బాక్సాఫీస్‌ వద్ద సినిమా పరాజయం చెందింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఇందులో చైతూ మూడు విభిన్న గెటప్స్ లో కనిపిస్తాడట.  ప్రస్తుతం ఆయా గెటప్స్ కోసం చైతూ మేకోవర్‌ అవుతున్నట్టు టాక్‌. షూటింగ్‌లు ప్రారంభమైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. ఈ సినిమాతో తన నటనలోని మరో యాంగిల్‌ని చూపించబోతున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గతంలో `మనం` చిత్రంలో చైతూ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. విక్రమ్‌ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమాకి చైతూ ఓకే చెప్పారని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్
చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి