రష్మికపై దిల్ రాజు స్పెషల్ ఇంటరెస్ట్!

By Udaya DFirst Published Mar 16, 2019, 10:47 AM IST
Highlights

కన్నడ భామ రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. వరుస విజయాలను అందుకుంటూ నిర్మాతల దృష్టిలో పడుతోంది. 

కన్నడ భామ రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. వరుస విజయాలను అందుకుంటూ నిర్మాతల దృష్టిలో పడుతోంది. ఇటీవల మహేష్ బాబు సినిమాలో రష్మికని తీసుకోవాలనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. అనీల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో ఈ సినిమా రాబోతుంది. దిల్ రాజు రష్మికని తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు అది మిస్ అవుతుండడంతో ఆమెకి మరో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడు.

ఈ ఏడాదిలో దిల్ రాజు నిర్మించబోయే చిత్రాల్లో ఒక సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. నాగచైతన్య హీరోగా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. గతంలో గల్లా జయదేవ్ కొడుకు అశోక్ కోసం రెడీ చేసిన కథ ఇది.

కానీ క్యాన్సిల్ కావడంతో హీరోగా చైతుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి రష్మిక రాబోతుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా 

గడుపుతోంది. తెలుగులో నితిన్ తో ఓ సినిమా చేయబోతుంది. 

click me!