ఇద్దరు హీరోయిన్లతో నాగచైతన్య రొమాన్స్.. అసలు కథ ఇదే?

Published : Jun 26, 2023, 05:31 PM IST
ఇద్దరు హీరోయిన్లతో నాగచైతన్య రొమాన్స్.. అసలు కథ ఇదే?

సారాంశం

నాగచైతన్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు చండూ మొండేటితో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు అప్‌డేట్లు వైరల్‌ అవుతున్నాయి. 

వరుస ఫెయిల్యూర్స్ తో నాగచైతన్యని కాస్త డల్‌ అయ్యారు. నెక్ట్స్ సినిమాల విషయంలో ఆయన చాలా కేర్‌ తీసుకుంటున్నారు. అందుకే పరశురామ్‌ సినిమాని కూడా పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `కార్తికేయ 2` తర్వాత చందూ మొండేటి నుంచి వస్తోన్న చిత్రమిది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. అందులో భాగంగా హీరోయిన్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. 

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. అందుకు కీర్తిసురేష్‌, అనుపమా పరమేశ్వరన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. నాగచైతన్య సరసన కీర్తిసురేష్‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇక అనుపమా పరమేశ్వరన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. హీరోతో ట్రావెల్‌ అయ్యే రోల్‌ అని కాకపోతే చాలా కీలకంగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఎవరూ ఫైనల్‌ కాలేదని, జస్ట్ టాక్స్ లో ఉందని సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కథా నేపథ్యానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా స్టోరీ కి సంబంధించిన ఓ లీకేజీ బయటకు వచ్చింది. ఈ సినిమా మత్య్సకారుల బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట. శ్రీకాకుళంలోని కళింగపట్నం మత్య్సకారుల కథానేపథ్యంలో నాగచైతన్య సినిమా సాగుతుందని, ఈ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా కథకి కీలకం కాబోతుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. నాగచైతన్య మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఫస్ట్ టైమ్‌ చైతూ ఒక రా కంటెంట్‌తో రాబోతున్నారని అర్థమవుతుంది.

నాగచైతన్యకి ఇటీవల సక్సెస్‌లు లేవు. `బంగార్రాజు` తర్వాత వరుసగా పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన `లాల్‌ సింగ్‌ చద్దా`, `థ్యాంక్యూ`, `కస్టడీ` చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. అందుకే చాలా కేర్‌ తీసుకుంటున్నారట చైతూ. ఈ సినిమాతో నమ్మకంతో ఉన్నారు అక్కినేని హీరో. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ