ఆ రెండు సినిమాలు ఎందుకు చేశానా..? అనిపిస్తుంది: నాగచైతన్య కామెంట్స్!

Published : Sep 12, 2018, 04:27 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
ఆ రెండు సినిమాలు ఎందుకు చేశానా..? అనిపిస్తుంది: నాగచైతన్య కామెంట్స్!

సారాంశం

అక్కినేని నాగ చైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు. 

అక్కినేని నాగ చైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు.

ఈ సినిమాను వీలైనంతగా జనాల్లోకి తీసుకువెళ్లాలని చైతు తాపత్రయపడుతున్నాడు. తాజాగా ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ లో బెస్ట్ సినిమా ఏదని అడిగితే 'ప్రేమమ్' అని టక్కున చెప్పిన ఈ హీరో 'దడ', 'బెజవాడ' ఈ రెండు సినిమాలు తనకు నచ్చనివని ఇకపై అలాంటి సినిమాల్లో నటించనని అన్నాడు.

ఇక మారుతి డైరెక్ట్ చేసిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విడుదల తరువాత చైతు 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కనిపించనుంది. నిజ జీవితంలో భార్యాభర్తలైన వీరు తెరపై కూడా ఆ పాత్రల్లోనే కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్