రానా అలియాస్ చంద్రబాబు నాయుడు!

By Udayavani DhuliFirst Published Sep 12, 2018, 3:07 PM IST
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. 

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు.

గతంలో బాలయ్య లుక్ ని విడుదల చేసిన చిత్రబృందం వినాయకచవితి సందర్భంగా సినిమాలో రానా లుక్ ని విడుదల చేశారు. రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గెటప్ లో రానా లుక్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. మీసం పెట్టి కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఈ పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ఫోటో కూడా కనిపిస్తుంది.

ఈ పాత్ర కోసం రానా చాలా హోమ్ వర్క్ చేశాడనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందంటూ గతంలో చెప్పుకొచ్చాడు రానా. వారాహి బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విద్యాబాలన్ బసవతారం పాత్ర పోషిస్తుండగా.. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు వంటి నటులు కనిపించబోతున్నారు. అలానే నరేష్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ వంటి నటుడు మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

 


Shri N.ChandraBabuNaidu 1984 pic.twitter.com/WfF7Sr4tjY

— Rana Daggubati (@RanaDaggubati)
click me!