కెరీర్‌లో తొలిసారి ఆ ప్రయోగం చేస్తున్న నాగచైతన్య? ఆ స్టార్‌ హీరోయిన్‌తో మరోసారి రొమాన్స్

Published : Jul 16, 2024, 09:43 PM IST
కెరీర్‌లో తొలిసారి ఆ ప్రయోగం చేస్తున్న నాగచైతన్య? ఆ స్టార్‌ హీరోయిన్‌తో మరోసారి రొమాన్స్

సారాంశం

నాగచైతన్య.. ఇప్పటి వరకు కమర్షియల్‌ మూవీస్‌, లవ్‌ స్టోరీస్‌కి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. ఆయన రూట్‌ మార్చాడు. ఫస్ట్ టైమ్‌ అలా కనిపించబోతున్నాడట.   

యువ సామ్రాట్‌ నాగచైతన్య.. వరుస పరాజయాల అనంతరం ఇప్పుడు కథల ఎంపికలో చాలా కేర్‌ తీసుకుంటున్నారు. కంటెంట్‌ ఉన్న సినిమాలకే ప్రయారిటీ ఇస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా చైతూ ప్రస్తుతం `తండేల్‌` చిత్రంలో నటిస్తున్నారు. పోర్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో మత్స్యకారుల జీవితాలను, అందులో ఓ జాలరీ ప్రేమకథని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు చందూమొండేటి. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌ కావడం విశేషం. `లవ్‌ స్టోరీ` తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మంచి క్రేజ్‌ నెలకొంది. 

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ దసరాకి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని టీమ్‌ భావిస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇంట్రెస్ట్ ని, ఓ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ మూవీ తర్వాత నాగచైతన్య మరో సినిమా చేయబోతున్నారు. `విరూపాక్ష` ఫేమ్‌ కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా ఫైనల్‌ అయ్యింది. నెక్ట్స్ మూవీగా ఇది తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

నాగచైతన్య తన కెరీర్‌లోనే తొలిసారి ఓ ప్రయోగం చేస్తున్నారట. ఆయన డ్యూయెల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడట. రెండు పాత్రల్లో ఒకటి డిఫరెంట్‌గా ఉంటుందని, దానికి సంబంధించిన మేకోవర్‌ కూడా కొత్తగా ఉంటుందట. ఇప్పటి వరకు చూడని నాగచైతన్యని ఈ సినిమాలో చూడొచ్చని తెలుస్తుంది. `తండేల్‌`కి సంబంధించిన షూటింగ్‌ వర్క్ కంప్లీట్‌ అయ్యాక.. చైతూ ఆ మూవీ మేకోవర్‌పై వర్క్ చేస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే `మనం` సినిమాలో చైతూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. కానీ అది ప్రాపర్‌ డ్యూయెల్‌ రోల్‌ కాదు. కానీ ఇందులో మాత్రం పూర్తి ద్విపాత్రాభినయం అని రెండు పాత్రలు భిన్నంగా ఉంటాయని అంటున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆయన పూజా హెగ్డేతో రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో `ఒక లైలా కోసం` చిత్రం వచ్చింది. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ హిట్‌ ఖాతాలోకి వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించబోతుండటం విశేషం. ఇందులో చైతూ, పూజాల మధ్య లవ్‌ ట్రాక్‌ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. లవ్‌ స్టోరీ మాత్రమే కాదు, యాక్షన్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లు కూడా ఉంటాయని, `తండేల్‌` తరహాలోనే మరో పెద్ద రేంజ్‌లో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నట్టు సమాచారం.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన