గేమ్ ఛేంజర్ నుండి షాకింగ్ వీడియో లీక్... రామ్ చరణ్ రోల్ ఇలా ఉంటుందా? మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్!

Published : Jul 16, 2024, 09:18 PM IST
గేమ్ ఛేంజర్ నుండి షాకింగ్ వీడియో లీక్... రామ్ చరణ్ రోల్ ఇలా ఉంటుందా? మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్!

సారాంశం

గేమ్ ఛేంజర్ మూవీ నుండి కీలక వీడియో లీక్ అయ్యింది.  వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అందుకు కారణం రామ్ చరణ్ రోల్ పై ఓ క్లారిటీ వచ్చింది.   

దర్శకుడు శంకర్ తో మూవీ చేయడం చాలా మంది హీరోల డ్రీం. భారీ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. రెండు దశాబ్దాలకు ముందే విజువల్ ఎఫెక్ట్స్ లో శంకర్ సరికొత్త ప్రయోగాలు చేశాడు. ఆయన తెరకెక్కించిన కథలు ట్రెండ్ సెట్టర్స్. అయితే కొన్నాళ్లుగా దర్శకుడు శంకర్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన స్థాయి చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 సైతం నిరాశపరిచింది. భారతీయుడు 2లో ఎక్కడా శంకర్ మార్క్ కనపడలేదనే వాదన వినిపిస్తోంది. 

అయితే గేమ్ ఛేంజర్ తో ఆయన హిట్ ట్రాక్ ఎక్కుతాడనే ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్స్ లో ఒకే ఒక్కడు ఆల్ టైం క్లాసిక్. మళ్ళీ ఇన్నేళ్లకు రామ్ చరణ్ హీరోగా శంకర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారతీయుడు 2 కారణంగా గేమ్ ఛేంజర్ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. 

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఓ కీలక సన్నివేశం లీక్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ కొందరు పొలిటికల్ లీడర్స్ తో వాగ్వాదానికి దిగాడు. సూట్ లో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి పాత్ర చేస్తున్నాడని ఇప్పటికే సమాచారం ఉంది. ఇక ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా... రాజకీయ నాయకులకు చుక్కలు చూపించేలా ఉంటుందని తాజా లీక్ తో స్పష్టం అవుతుంది. 

గేమ్ ఛేంజర్ లీక్డ్ వీడియో అంచనాలు పెంచేయగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ నిర్మించారు. 
 

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌