
అక్కినేని నటవారసుడు నాగచైతన్య స్పెషల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ.. దానినే హిట్ ఫార్ములాగా చేసుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపొతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ లవ్‌స్టోరి, బంగార్రాజు లాంటి రెండు వరుస హిట్ లను సొంతం చేసుకున్న నాగచైతన్య అదే జోరును కొనసాగిస్తున్నాడు.
అయితే ఇపుడు టాలీవుడ్ లో టైర్-2 హీరోలలో వరుస హిట్స్ పడటంతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య నటించిన థాంక్యూ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ హిట్ పడితే చైతూ ఖాతాలో హ్యాట్రిక్ పడినట్టే. మనం ఫేం విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా... షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈమూవీ షూటింగ్ జరుగుతుండగానే ఇదే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు నాగచైతన్య. ధూత టైటిల్ లో రూపొందుతున్న ఈ వెబ్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ సంస్థ నిర్మిస్తుంది. లేటెస్ట్‌గా అమెజాన్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా నాగచైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్, పార్వతి, ప్రియా లతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
సూపర నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలోని కథ తో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుంది. నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది. ఈ వెబ్ మూవీలో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈ వెబ్ సీరీస్ ఆగస్టు చివరి నుంచి అమెజాన్ లో స్క్రీమింగ్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.