
హీరోయిన్ గా ఒకప్పుడు సత్తా చాటిన ట్వింకిల్ ఖన్నా.. రచయితాగా మారారు. ఇప్పుడు నిర్మాతగా సత్తా చాటడానకి రెడీ అవుతున్నారు. మరి ఈ విషయంలో అక్షయ్ కుమార్ కామెంట్ ఏంటీ..? ఆయన ఏమన్నారు..? ఏ కథతో ట్వింకిల్ సినిమా చేస్తున్నారు.
అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా రాసిన పుస్తకం సినిమాగా రూపొందబోతోంది. ఈ సినిమాతో ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ గామారబోతున్నాడు.ఈ సినిమాను రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ట్వింకిల్ ఖన్నా ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ట్వింకిల్ ఖన్నా భర్త,బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. ట్వింకిల్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నవ్వుతూనే ఉద్వేగానికి లోనయ్యాను. ఇలాంటి మంచి పుస్తకం సినిమాగా రావడం సంతోషంగా ఉంది. ప్రతి భావంతులైన టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
ఇక తన నానమ్మ, ఆమె సోదరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ సలామ్ నోని అప్ప పుస్తకాన్ని రాశారు ట్వింకిల్. సినిమాలకు దూరమైన ఆమె తనకు తానుగానే నటనకు నేను పనికిరానని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే పెన్ తో మాత్రం అద్భుతంగా ఫన్ పండిచగలు అంటోంది ట్వింకిల్. అలా కాన్ఫిడెంట్ గా ఆమె రాసిన పుస్తకమే సలామ్ నోనీ అప్పా .2016లో అచ్చైన ఈ షార్ట్ స్టోరీ ఇప్పుడు సినిమాగా రూపొందబోతోంది.
ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ పేరుతో ట్వింకిల్ ఖన్నా 2016లో పుస్తకం రాసింది. ఆ ఆంథాలజీలోని నాలుగు కథల్లో ఒకటే... సలామ్ నోనీ అప్పా. ఇప్పుడు అదే షార్ట్ స్టోరీని సినిమాగా తీయబోతున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. అయితే ఈ మూవీ వర్షన్ కి సోనల్ దబ్రాల్ దర్శకత్వం వహించనున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా ఎంతో పేరున్న తనకి ఇదే మొదటి ఫుల్ లెంగ్త్ సినిమా. అలాగే, ట్వింకిల్ ఖన్నా తన కథని సినిమాగా మార్చే ప్రయత్నంలో తానే నిర్మాతగా మారి సత్తా చాటనుంది.
ఇక ట్వింకిల్ ఖన్నా ఆమె బ్యానర్ మిసెస్ ఫన్నీబోన్స్ మూవీస్ తో పాటూ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతోంది. ట్వింకిల్ గ్రాండ్ మదర్, ఆమె సిస్టర్ మధ్య రిలేషన్ కి స్టోరీ రూపమే... సలామ్ నోనీ అప్పా. ఈ బుక్ రిలీజ్ సందర్భంగా కూడా గతంలో ట్వింకిల్ ఖన్నా ఇంట్రె స్టింగ్ విషయాలను పంచుకున్నారు. మరి ఈసారి సినిమాగా ఈ కథకు ఎలాంటి రూపం ఇస్తారో చూడాలిమరి.