
మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఆచార్య’ (Acharya) చిత్రం నిన్న థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందనను పొందింది. మరోవైపు ఫస్ట్ ఓపెనింగ్ కూడా డల్ గానే మొదలైందంటూ కొన్న రిపోర్టులు చెబుతున్నాయి. మరోవైపు సినిమా ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా, డల్‌గా ఉంటుందని, సెకండ్ హాఫ్ డీసెంట్‌గా ఉందని, రెజీనా కసాండ్రా ఐటెమ్ నంబర్, క్లైమాక్స్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి సోల్‌గా నిలుస్తాయని అంటున్నారు. కొరటాల శివ కొరటాల శివ దర్శకత్వంలో ఇలాంటి సినిమా రావడాన్ని విమర్శకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటి వరకు ఫెల్యూర్ లేని డైరెక్టర్ గా పేరున్న శివ ఖాతాలో ‘ఆచార్య’ కొంత నిరాశపరిచిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
బాక్సాఫీస్ విషయానికొస్తే, యాక్షన్ చిత్రం హోమ్ మార్కెట్‌లో దాదాపు 1150 థియేటర్లలో విడుదలైంది, అత్యధికంగా నైజాం మరియు సీడెడ్ ఏరియా 600+ థియేటర్లు, ఆంధ్రాలో 500 థియేటర్లకు పైగా మరియు ఓవర్సీస్‌లో 650+ థియేటర్లలో విడుదలైంది. మొత్తం థియేటర్ల సంఖ్య 2000కి పైగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం 200+ థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నాయంటున్నారు.
తొలిరోజు ఏపీ తెలంగాణలో కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం: 7.90 కోట్లు, సీడెడ్: 4.60Cr(1.75Cr అద్దెలు), UA: 3.61Cr(1Cr హైర్స్), తూర్పు: 2.53Cr(1.30Cr), పశ్చిమ: 2.90Cr(2Cr), గుంటూరు: 3.76Cr(2.25Cr), కృష్ణ: 1.90Cr(1Cr), నెల్లూరు : 2.30 కోట్లు (1.51 కోట్లు) రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయని తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి వీకెండ్ ను ఎలా పూర్తి చేస్తుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే (Pooja Hegde) నటించారు. బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ కీలక పాత్రలో నటించారు.