Rudra:‘రుద్ర’ ట్రైలర్..పోలీస్ గా అదరకొట్టాడు

Surya Prakash   | Asianet News
Published : Jan 30, 2022, 06:24 AM IST
Rudra:‘రుద్ర’ ట్రైలర్..పోలీస్ గా అదరకొట్టాడు

సారాంశం

'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' ట్రైలర్ విషయానికొస్తే.. భయంకరమైన కిల్లర్ లను పట్టుకోవడంలో పేరు మోసిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే తన భార్యతో విడిపోవడంతో వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదని తెలుస్తోంది.

 ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓటీటీ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. అజయ్‌ ప్రధాన పాత్రలో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌, బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే సిరీస్‌ని రూపొందిస్తున్నాయి.  ఈ రోజు ఈ వెబ్ సీరిస్ కు చెందిన ట్రైలర్ ని విడుదల చేశాయి.

రుద్ర' ట్రైలర్ ను అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ''వెలుతురు చీకటి మధ్య ఉన్న లైన్ వద్ద నేను నివసిస్తుంటాను. #రుద్ర తో చీకటి అంచు వరకు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి'' అని మేకర్స్ పేర్కొన్నారు.

'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' ట్రైలర్ విషయానికొస్తే.. భయంకరమైన కిల్లర్ లను పట్టుకోవడంలో పేరు మోసిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే తన భార్యతో విడిపోవడంతో వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదని తెలుస్తోంది. అజయ్ భార్యగా ఈషా డియోల్ కనిపించింది.

నగరంలో జరుగుతున్న హత్యలను ఛేదించే క్రమంలో ఒక పోలీసాఫీసర్ కు ఎదురయ్యే సవాళ్ళను 'రుద్ర' వెబ్ సిరీస్ లో చూపించబోతున్నార

‘తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో పోలీసు పాత్రల్ని పోషించిన అజయ్‌ దేవగణ్‌ ఈ సిరీస్‌లో మరో శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది ఈ సిరీస్‌. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ వేదికగా విడుదలకానుంది’ అని పేర్కొన్నాయి.

 ఈ సిరీస్ ఇద్రీస్ ఎల్బా రూపొందించిన బ్రిటిష్ షో ‘లూథర్’కు హిందీ రీమేక్. ఈ హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్ త్వరలో నిర్మాణం కానుంది. ముంబైలోని ఐకానిక్ లొకేషన్స్ లో ఈ సిరీస్ చిత్రీకరించబడుతుంది. ఈ సిరీస్ లో అజయ్ దేవ్‌గన్ పోలీసు పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ‘రుద్ర’ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియంలో ప్రసారం కానుంది. ఇక అజయ్ దేవగన్ ఇదివరకే ‘సింగం రిటర్న్స్’ వంటి చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

 రాజేశ్‌ మపుస్కర్‌ దర్శకుడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అజయ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు