
కేజీఎఫ్ సినిమాతో దర్శకుడిగా తన ఇమేజ్ ను పార్ ఇండియా లెవల్ కు పెంచుకున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తోన్న సలార్ మూవీ సక్సెస్ అయితే.. ప్రశాంత్ నీల్ రేంజ్ మారిపోయినట్టే. అందుకే సలార్ ను జాగ్రత్తగా చెక్కుతున్నాడు. సలర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా రోజుల తరబడి ఇంటికి వెళ్ళకుండా సెట్స్ లోనే గడిపేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఆయనకు ఈరోజు (05 మే) చాలా ప్రత్యేకమైన రోజు. ఈ స్పెషల్ డేను కూడా ప్రశాంత్ నీల్ ఇంటికి వెల్ళకుండా సలార్ సెట్స్‌లోనే గడిపాడు. ఇంతకీ ఏంటా స్పెషల్ డే అంటే ఆయన పెళ్లి రోజు.
అవును ఈరోజు ప్రశాంత్ నీల్ 12వ వివాహ వార్షికోత్సవం. ఈరోజు కూడా ఇంటికి వెళ్ళకుండా.. సెట్ లోనే పనిలోనే ఉన్నాడు ప్రశాంత్ నీల్. అయితే. సలార్ సెట్స్ కు ఆయన భార్యలిఖిత వచ్చారు. పెళ్ళి రోజును సెట్ లోనే జరుపుకున్నారు. .సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్-లిఖిత కపుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సూపర్ క్యూట్ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఇక్కడ మరో చిత్రం ఏంటంటే.. ఈ ఫోటోలో మరో కటౌట్ కనిపిస్తుంది. ఆ హైట్.. పర్సనాలిటీ.. షర్ట్ చూస్తే.. అందులో ఉన్నది ప్రభాస్ అంటున్నారు. ఫొటో బ్యాక్ డ్రాప్‌లో బ్లాక్ టీ షర్ట్‌లో ఉన్న వ్యక్తి గురించి తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇక శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాను సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకుతీసుకురాబోతున్నారు. ఈమూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.