Ram Pothineni : జెనీలియాను గుర్తు చేసుకున్న హీరో ‘రామ్ పోతినేని’.. ఇంకా టచ్ లోనే ఉన్నాడా!?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 04, 2022, 12:13 PM IST
Ram Pothineni : జెనీలియాను గుర్తు చేసుకున్న హీరో ‘రామ్  పోతినేని’.. ఇంకా టచ్ లోనే ఉన్నాడా!?

సారాంశం

ఇస్మార్ట్ హీరో,  ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. అయితే గతంలో హీరోయిన్ జెనీలియాతో  కలిసి ‘రెడీ’ మూవీ చేశాడు రామ్. కాగా తమ స్నేహాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.  

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తూ ఆడియెన్స్ ను షాక్ కు గురిచేస్తున్నారు. అప్పటికే హ్యాండ్ సమ్ గా ఉండే రామ్ మాస్ లుక్ లోనూ హై గా ఉన్నారు.  గతంలో దేవదాసు, జగడం, రెడీ, మస్కా లాంటి మూవీలతో ప్రేక్షకులకు  ఎంతగానో దగ్గరయ్యారు. తన స్టైల్, అద్భుతమైన డ్యాన్స్, ఫేర్ లుక్ తో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సొంత చేసుకున్నారు రామ్.

అయితే తాను చేసిన సినిమాల్లో తొలినాళ్లలో ‘దేవదాస్’తర్వాత  హిట్ గా  నిలిచిన చిత్రం ‘రెడీ’. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ లో వచ్చిన ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా రామ్ పోతినేని, జెనీలియా నటించి మెప్పించారు. సినిమాలో వీరి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. పైగా సినిమా కూడా హిట్ కావడంతో మరో సినిమా కలిసి చేస్తారేమో అని ఆడియెన్స్ ఊహించారు. కానీ అలా జరగలేదు. ‘రెడీ’ మూవీ తర్వాత రెండు మూడు సినిమాల్లో మెరిసిన జెనిలియా 2013లో పెళ్లికి సిద్ధమైంది.

 

బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ ‘రితీష్ దేశ్ ముఖ్’ను 2013లో పెండ్లి చేసుకుంది. రితీష్, జెనీలియా 2003లో ‘తుజే మేరీ కసమ్’ మూవీలో నటించారు. ఇది జెనిలియాకు మొదటి చిత్రం... ఈ మూవీతోనే గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ  ఇచ్చింది. అయితే అప్పటి నుంచే ప్రేమలో ఉన్న  వీరు పెండ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.  నిన్న వారి పెండ్లి రోజు సందర్భంగా జెనిలియా ఒక వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 

తన భర్త తనను హత్తుకుంటూ పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటాడు. ఇందుకు జెనిలియా కూడా రితీష్ ను హత్తుకుని విషేశ్ తెలియజేస్తుంది. ఆ వీడియోను చూసిన రామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘హ్యాపీ యానివర్సరీ మై క్యూటీస్’ అంటూ విషేస్ తెలిపాడు. గతంలోనూ రామ్ పోతినేని, జెనీలియా ఫన్నీ వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే 14 ఏండ్ల కితం కలిసి సినిమా చేసినా ఇంకా వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటూ, ప్రత్యేకమైన రోజుల్లో ఒకరినొకరు గుర్తు చేసుకోవడం విశేషం. ఇందుకు వారి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఉంటే వీరిద్దరిని మరోసారి స్క్రీన్ పై చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం రామ్ లింగుస్వామి డైరెక్షన్ లో ‘ది వారియర్’ మూవీలో నటిస్తున్నారు. జెనిలియా, తన భర్తతో కలిసి ‘మిస్టర్ మమ్మీ’ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.
 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే