ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు.. ఓపెనింగ్స్, కలెక్షన్స్ మారిపోతున్నాయి : నాగ చైతన్య

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 10, 2022, 02:54 PM IST
ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు.. ఓపెనింగ్స్, కలెక్షన్స్ మారిపోతున్నాయి : నాగ చైతన్య

సారాంశం

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రం స్టార్ హీరో సినిమా బంగార్రాజు మాత్రమే. కొన్ని చిన్న చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నప్పటికీ.. సందడి మొత్తం బంగార్రాజు చుట్టూనే నెలకొంది.

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రం స్టార్ హీరో సినిమా బంగార్రాజు మాత్రమే. కొన్ని చిన్న చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నప్పటికీ.. సందడి మొత్తం బంగార్రాజు చుట్టూనే నెలకొంది. ఫెస్టివల్ వైబ్స్ ఉన్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. నాగార్జున తో పాటు ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. 

ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఆదివారం రోజు బంగార్రాజు మ్యూజికల్ నైట్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. నాగ చైతన్య మాట్లాడుతూ.. 'మనం' మూవీ తర్వాత ఇప్పుడు బంగార్రాజు చిత్రానికి మ్యూజికల్ నైట్ నిర్వహించడం సంతోషంగా ఉందని నాగ చైతన్య పేర్కొన్నాడు. 

సినిమాలో ఒక్క సాంగ్ వైరల్ అయినా చాలు.. ఆ చిత్రానికి ఓపెనింగ్స్, కలెక్షన్స్ మారిపోతున్నాయి. అలాంటిది అనూప్ రూబెన్స్ బంగార్రాజు చిత్రానికి ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నేను నిజంగా బంగారం లాంటి పాత్ర చేశాను అని నాగ చైతన్య పేర్కొన్నాడు. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం మీ అంచనాలకు మించి ఉంటుందని నాగ చైతన్య తెలిపాడు. 

నాగార్జున మాట్లాడుతూ.. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోస్ కి ఇంపార్టెంట్ డే. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టిందే జనవరి 14న అని నాగార్జున అన్నారు. ఇక 50 ఏళ్ల క్రితం జనవరి 14న దసరా బుల్లోడు చిత్రంతో నాన్నగారు చేసిన సందడి అంతా ఇంతా కాదు అని నాగ్ తెలిపారు. 

ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్యకి జోడిగా కృతి శెట్టి నటించింది. కృతి శెట్టి మాట్లాడుతూ నేను చేసిన ఫస్ట్ డాన్స్ సాంగ్ 'బంగార బంగార' అని పేర్కొంది. ఆ సాంగ్ వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిస్తుంది అని పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే