
అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమకి బీజం పడింది ఏ మాయ చేశావే చిత్రంతోనే. ఈ చిత్రం విడుదలై నేటికి 13 ఏళ్ళు పూర్తయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటికి చైతు జోష్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫస్ట్ హిట్ దక్కింది మాత్రం ఈ చిత్రంతోనే.
సమంత టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ చిత్రంతోనే. 2010లో విడుదలైన ఈ చిత్రం యువతని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయం దక్కించుకుంది. సమంత, నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రం 13 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు పెడుతున్నారు. నాగ చైతన్య సెటిల్డ్ పెర్ఫామెన్స్, సమంత క్యూట్ డైలాగ్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ చిత్రం 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ చైతన్య, సమంత ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇద్దరి పోస్ట్ లు విభిన్నంగా ఉన్నాయి. సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ ఆఫ్ ఏ మాయ చేశావే అంటూ చైతన్య పోస్ట్ చేశాడు. సమంత ని కౌగిలించుకుని ఉన్న పోస్టర్ ని జత చేశాడు.
కానీ సమంత మాత్రం విభిన్నంగా పోస్ట్ చేసింది. తన ఫోటోలు మాత్రమే ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది. 13 ఇయర్స్ ఆఫ్ జెస్సీ.. ఏమాయ చేశావే అని కామెంట్ చేసింది. నాగ చైతన్య ఉన్న పోస్టర్ ని కూడా సామ్ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు వీరిద్దరు విడిపోయినప్పటికీ అది కలసి నటించిన చిత్రమే. దీనితో నాగ చైతన్య, సమంత పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఏమాయ చేశావే చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో చై సామ్ స్నేహితులుగా ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. అనేక చిత్రాల్లో కలసి నటించారు. పెద్దల అంగీకారంతో 2017లో ఈ జంట వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమో.. 2021లో ఈ జంట అందరికి షాక్ ఇస్తూ విడాకులు ప్రకటించారు. అయితే విడాకులకు గల కారణాలు ఎవరికీ తెలియదు. విడిపోయాక సమంత తన సోషల్ మీడియా నుంచి నాగ చైతన్య ఫోటోలని తొలగించిన సంగతి తెలిసిందే.