అఫీషియల్.. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

By Asianet News  |  First Published Feb 26, 2023, 4:53 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. రోటీన్ కు భిన్నంగా తెరకెక్కకుతున్న ఈ చిత్రం టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. 


టాలీవుడ్ యంగ్ అండ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి రెండేండ్లుగా ఒక్క చిత్రం కూడా రావడం లేదు. చివరిగా ‘రిపబ్లిక్’ సినిమాతో అలరించారు. పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటుండటంతో సాయి ధరమ్ తేజ్ పై ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం అదే తరహాలో ‘విరూపాక్ష’ అనే చిత్రంతో రాబోతున్నాడు. 

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న Virupaksha చిత్రం  కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. 

Latest Videos

తాజాగా విరూపాక్ష చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ అందింది. చిత్ర టీజర్ ను సిద్ధం చేసినట్టు యూనిట్ తెలిపింది. Virupaksha Teaser మార్చి 1న విడుదల చేయనున్నట్టు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ అధికారికంగా ప్రకటించింది. Courage Over Fear అనే కాప్షన్ ఇస్తూ టీజర్ పై ఆసక్తిని పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్రమంలో టీజర్ అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

లాక్ డౌన్ సమయంలో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురైన విషయం తెలిసిందే. దాని తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గానే కోలుకున్న ఆయన వరుస ప్రాజెక్ట్స్ ను మళ్లీ లైన్ లో పెడుతున్నారు. ఈసందర్భంగా ‘విరూపాక్ష’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్రం కోసమూ ఆయన బాగానే కష్టపడుతున్నాడు. చిత్రం 2023 సమ్మర్ ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు తోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడలోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్డ్‌ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్‌ ఇది. అక్కడ జరిగే వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆసక్తిగా ఉండనుంది. మరోవైపు మామ పవన్ కళ్యాణ్ తోనూ ‘వినోదయ సీతమ్’ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది ఆగస్టులో విడుదల కానుందని సమాచారం. 

 

Get ready to Enter the World of 👁️🔍

'Supreme Hero' 's will be out on March 1st 📣💥 pic.twitter.com/DoP7cRI2ME

— SVCC (@SVCCofficial)
click me!