RRR పై విషం కక్కిన తమ్మారెడ్డికి అదే స్థాయిలో కౌంటర్.. రెచ్చిపోయిన మెగా బ్రదర్ నాగబాబు

Published : Mar 09, 2023, 11:20 PM IST
RRR పై విషం కక్కిన తమ్మారెడ్డికి అదే స్థాయిలో కౌంటర్.. రెచ్చిపోయిన మెగా బ్రదర్ నాగబాబు

సారాంశం

ఆర్ఆర్ఆర్ చిత్రానికి అనేక అంతర్జాతీయ అవార్డులు దాసోహం అవుతున్నాయి. ఈ తరుణంలో తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అయ్యాయి.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. రీసెంట్ గా తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ చిత్రంపై విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానులని ఆగ్రహానికి గురయ్యారు చేశారు . ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆస్కార్స్ కోసం ఏకంగా రూ 80 కోట్లు ఖర్చు చేసింది అంటూ తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై ఎలా దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆస్కార్ అవార్డుకి ఒకే ఒక్క అడుగు దూరంలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఉంది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. 

గత కొంతకాలంగా రాజమౌళి అండ్ టీం ఫారెన్ లోనే ఉంటూ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా దాసోహం అవుతున్నాయి. ఈ తరుణంలో తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అయ్యాయి. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న వ్యక్తి తెలుగు సినిమా సాధించిన ఘనతని కించపరిచే విధంగా మాట్లాడటం ఏంటి అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రత్యర్థులకు తనదైన శైలిలో సమాధానం చెప్పే నాగబాబు.. తాజాగా తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. 

 

'నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం. RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం' అంటూ నాగబాబు పరోక్షంగా తమ్మారెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తమ్మారెడ్డి కామెంట్స్ పై రాఘవేంద్ర రావు ఘాటుగా స్పందిస్తే.. మెగాబ్రదర్ నాగబాబు ఇంకా ఘాటుగా రెచ్చిపోయారు. నాగబాబు ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నాగబాబు ఎవరూ ఊహించని విధంగా ఒక సిక్స్ కొట్టి ఆట ముగించారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దురుద్దేశంతో ఆర్ఆర్ఆర్ పై విషం కక్కిన తమ్మారెడ్డికి ఇలాగే బదులు ఇవ్వాలి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా