డిసెంబ‌ర్ 16న `నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్` విడుద‌ల‌

Published : Dec 02, 2016, 02:54 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
డిసెంబ‌ర్ 16న `నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్` విడుద‌ల‌

సారాంశం

ఈ నెల 16న విడుద‌ల కానున్న నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్` మూవీ  భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వం లో   రావు ర‌మేశ్‌,  హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్ బాబు, న‌టిన‌టులుగా రూపోందిన చిత్రం శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు  విడుద‌ల చేయ‌నున్నారు.

చిత్ర నిర్మాత  బెక్కం వేణుగోపాల్ (గోపి)  మాట్లాడుతూ ``తండ్రీ కూతుళ్ల మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే చిత్ర‌మిది. వ‌య‌సులో ఉన్న అమ్మాయి `నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్` అని ఎందుకు అన్న‌ది? అనేది మా చిత్రంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం.  షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. శేఖర్ చంద్ర చాలా మంచి బాణీలిచ్చారు.  పాట‌ల‌న్నీ విన‌సొంపుగా ఉన్నాయి. ఈ వారం పాట‌ల్ని విడుద‌ల చేస్తాం.  ఆడియో సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. ఆ మ‌ధ్య మేం విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. డిసెంబ‌ర్ 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం.  దిల్‌రాజుగారికి మా సినిమా చాలా బాగా  న‌చ్చింది. ఆయ‌నే  విడుద‌ల చేస్తున్నారు`` అని తెలిపారు.కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి కెమ‌రా: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్: విఠ‌ల్ కోస‌న‌మ్, ఎడిట‌ర్: చోటా.కె.ప్ర‌సాద్‌, స్క్రీన్ల‌ప్లే, మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, క‌థ‌: బి.సాయికృష్ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర్ భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, నృత్యాలు: విజ‌య్ ప్ర‌కాశ్‌, స్టంట్స్: వెంక‌ట్‌.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌