
త్వరలోనే అబ్బాయ్ రాంచరణ్ తో బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓ మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. రీసెంట్ గా పవన్ ప్రొడ్యూసర్ గా యంగ్ హీరో నితిన్ తో ఓ మూవీని స్టార్ట్ చేసాడు. అది పూర్తి అవ్వగానే హిరో రాంచరణ్ తో సినిమాను తియ్యడానికి పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నడు.
ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రొడ్యూసర్ గా కూడా వరుసగా సినిమాలు చేసే ప్లాన్ లో వున్నాడట. తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చెర్రీతో మూవీ ప్లాన్ చేసాడట. ఇంతకుముందు చెర్రీ.. త్రివిక్రంతో చేయాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. అందుకే చెర్రీ కోరిక తీర్చడానికి త్రివిక్రంని ఒప్పించాడట పవన్ కళ్యాణ్. రాంచరణ్ 'ధృవ' ఫినిష్ చేసి సుకుమార్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ ప్రొడ్యూస్ చేయబోయే మూవీ వుంటుందని సమాచారం.