'నాపేరు సూర్య'కు టాక్ తో సంబంధమే లేదు!

Published : May 07, 2018, 03:28 PM IST
'నాపేరు సూర్య'కు టాక్ తో సంబంధమే లేదు!

సారాంశం

మూడు రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన మొత్తం సుమారుగా రూ.85.32 కోట్ల రూపాయలు. తొలివారంలో మూడు భాషల్లో కలిపి ఇంత మొత్తాన్ని రాబట్టింది

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమాకు కాస్త మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనాలను సరిగ్గా నడిపించలేకపోయారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినిమా టాక్ కు సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన మొత్తం సుమారుగా రూ.85.32 కోట్ల రూపాయలు. తొలివారంలో మూడు భాషల్లో కలిపి ఇంత మొత్తాన్ని రాబట్టింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.

మొదటిరోజు అంతంత మాత్రంగానే నడించిన ఈ సినిమా అమెరికాలో రెండో రోజు 5 లక్షల డాలర్లను వసూలు చేసింది. మొదటిసారిగా ఈ సినిమాలో బన్నీ యాంగ్రీ ఆర్మీ మ్యాన్ గా కనిపించాడు. మిగిలినవాటితో పోలిస్తే సినిమాకు బన్నీ నటన హైలైట్ గా నిలిచింది. తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు బన్నీ. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి