
పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర ఈ రోజు ( బుధవారం) నుంచి ప్రారంభం అయ్యింది. సత్యదేవుని దర్శనంతో జనసేన వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రతువులో పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. వై. రవిశంకర్ (మైత్రి మూవీస్), డీవీవీ దానయ్య (డీవీవీ ఎంటర్‌టైన్మంట్ ), ఏఎం రత్నం (మెగా సూర్యా ప్రొడక్షన్ ), బీవీఎస్ఎన్ ప్రసాద్ (ఎస్వీసీసీ), వివేక్ కూచిభొట్ల (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ) తోపాటు దర్శకులు హరీష్ శంకర్‌లు యాగశాలకు విచ్చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించారు. యాగక్రతువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని అభిలషించారు . విజయాలనందించే వారాహి రథంపై సమరాన్ని ఆరంభించే సాహసి వస్తున్నాడని, ఆయనకు విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే అదే సమయంలో అందరు బొకేలు ఇచ్చి పవన్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.కానీ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers) అధినేతల్లో ఒకరైన రవిశంకర్(ravishankar) మాత్రం పవన్ పాదాలకు నమస్కారం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బొకే ఇచ్చిన వెంటనే ఆయన పవన్ కాళ్లకు నమస్కారం చేయడానికి వంగగా.. వెంటనే పవన్ ఆయనను మధ్యలో ఆపేసి కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఒక నిర్మాత అయ్యి ఉండి .. ఇలా పవన్ కాళ్ళు మొక్కడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ పై ఉన్న అభిమానం అలాంటింది అని కొందరు అంటుండగా.. మరికొందరు.. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఎదటివాళ్ల మీద తమకు ఉన్న అభిమానం,ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపుతారు..రవిశంకర్ అలా చూపెట్టారు..అది ఆయన ఇష్టం..పవన్ కాళ్లు మొక్కితే మీకేంటి ప్లాబ్లం,మిమ్మల్ని మొక్కమనలేదుగామధ్యలో మీకేంటి అని మరికొందరు రవిశంకర్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపులుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే గొప్ప యాత్ర కావాలని ఆకాంక్షించారు. ప్రజా క్షేమం కాంక్షిస్తూ చేస్తున్న యాగక్రతువులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, యాత్ర సైతం రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లోనూ రాణించాలని .. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచిపోలేని నాయకుడు కావాలంటూ ఆకాంక్షించారు.