మెగాస్టార్ చిరంజీవితో మరోసారి జతకట్టబోతున్న త్రిష..

Published : Jun 14, 2023, 01:17 PM ISTUpdated : Jun 14, 2023, 01:27 PM IST
మెగాస్టార్ చిరంజీవితో మరోసారి జతకట్టబోతున్న త్రిష..

సారాంశం

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ కలవబోతోంది. మెగా ఫ్యాన్స్ ఊర్రూతలూగేలా చిరంజీవితో కలిసి చెన్నై చిన్నది త్రిష సందడి చేయబోతోంది. 

సీనియర్ హీరోలు దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. సీనియర్ హీరోలు మాత్రం వరుసగాసినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా కంప్లీట్ అవ్వకముందే మరొక సినిమా చేస్తూ.. అది స్టార్ట్ అవ్వకముందే.. ఇంకో సినిమా స్టార్ట్ చేస్తూ.. దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. 

భోళాశంకర్ తరువాత చిరంజీవి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.  ఇద్దరు దర్శకులతో.. ఇప్పటికే స్టోరీ డిస్కర్షన్స్ కూడాయ అయిపోయాట.  అందులో ఒకరు వశిష్ఠ అయితే.. మరొకరు కల్యాణ్ కృష్ణ. చిరంజీవితో సోషియో ఫాంటసీ చేయడానికి వశిష్ఠ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈయన గతంలో కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక  మెగాస్టార్ కోసం కల్యాణ్ కృష్ణ ఒక విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు.ఈయన నాగార్జునతో బంగార్రాజు సినిమా చేశాడు. 

ఈ సినిమాల్లో ఒక సినిమాలో హీరోయిన్ గా  త్రిషను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.  గతంలో ఆమె చిరంజీవి సరసన హీరోయిన్ గా స్టాలిన్ సినిమాలో చేసింది . ఈమధ్యలో ఒక సారి మెగాస్టార్ సినిమాలో జాయిన్ అయిన త్రిష..క్రియేటీవ్ డిఫరెన్స్ ల వల్ల సినిమా నుంచి తప్పకుంది ఇక  మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నారు. పొన్నియన్ సెల్వన్ తరువాత లో త్రిష ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. 

దాంతో ఆమె హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. చేయడమే కాదు.. ఆఫర్లు కూడా అంతే  గ్లామర్ చూసిన వాళ్లంతా, మళ్లీ ఆమెకి తెలుగు నుంచి ఛాన్సులు వెళ్లడం ఖాయమని అనుకున్నారు . ఇక మెగాస్టార్ తో త్రిష కాంబో ఖాయమనే తెలుస్తోంది. అంతే కాదు మెగాస్టార్ చేయబోతున్న ఈసినిమాలో ఆయన తనయుడిగా సిద్ధూ జొన్నలగడ్డ కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన జోడీగా శ్రీలీలను దాదాపు ఖాయం చేసినట్టేనని చెబుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తన సొంత బ్యానర్లో చిరంజీవి కూతురు సుస్మిత నిర్మిస్తుండటం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?