ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు, ఎన్టీఆర్ మూవీపై అంచనాలు పెంచేసిన మేకర్స్

Published : Jun 04, 2025, 04:06 PM IST
Prashanth Neel and Jr NTR

సారాంశం

ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేసింది. 

మాస్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన డైరెక్టర్ 

భారీ యాక్షన్ చిత్రాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి పాన్-ఇండియా స్థాయిలో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “కెజీఎఫ్” సిరీస్ తో ఇండియన్ మాస్ యాక్షన్ సినిమాల స్థాయిని పెంచిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత, ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌తో కలిసి రూపొందిస్తున్న కొత్త చిత్రం పేరు డ్రాగన్. అయితే ఈ టైటిల్ ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం #NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. 

ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు 

ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. “మాస్ ఎంటర్టైనర్స్‌కు కొత్త దారిని చూపిన అర్కిటెక్ట్,” అంటూ ప్రశాంత్ నీల్‌కు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మేకర్స్ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ నీల్ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. 

 

 

బాక్సాఫీస్ రికార్డులు గ్యారెంటీ 

నిర్మాతల ప్రకారం, #NTRNeel చిత్రం ఇప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తూ, కొత్త రికార్డులు నెలకొల్పనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “థియేటర్లలో ఈ సినిమాతో సంబరాలు చేసుకుంటాయి. బిగ్ స్క్రీన్ మీద ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీనిని 2026 జూన్ 25న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికపై ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో