'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెనుక అసలు కథ ఇదే: రామ్ గోపాల్ వర్మ!

Published : Feb 15, 2019, 03:23 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెనుక అసలు కథ ఇదే: రామ్ గోపాల్ వర్మ!

సారాంశం

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడానికి గల అసలు కారణాన్ని ప్రజలకు చెప్పాలని ఎన్టీఆర్ గారు తనను అడిగారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడానికి గల అసలు కారణాన్ని ప్రజలకు చెప్పాలని ఎన్టీఆర్ గారు తనను అడిగారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. ఈ క్రమంలో ఓ వాయిస్ మెసేజ్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఆ వాయిస్ లో.. ఎన్టీఆర్ గారు 1989 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన సమయమది అంటూ మొదలు పెట్టిన వర్మ.. ఎన్టీఆర్ కుటుంబీకులు, పార్టీ వారు ఆయన్ని ఏకాకిగా వదిలేసినా సమయంలో లక్ష్మీపార్వతి అనే స్త్రీ ఆయన జీవితంలోకి ప్రవేశించిందని చెప్పారు. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయ రూపురేఖలను అతలాకుతలం చేసేసి పర్మినెంటుగా ఎలా చెరగని ముద్ర వేసిందనేదే ఈ సినిమా సారంశమని తెలిపారు. 

''ఈ సినిమా ఉద్దేశం పాతిక సంవత్సరాల నుండి నిజాలుగా చెలామణి అవుతున్న సిగ్గులేని అబద్ధాలను శాశ్వతంగా నిజం అనే గోతిలో పాతిపెట్టడం, రాజకీయ మోసగాళ్ల మొహాల మీద ముసుగులుతీసి పారేసి వారి అసలు వికార నగ్నత్వాన్ని అందరికీ చూపెట్టడమేనని'' అన్నారు. 

''అలాగే ఆమెతో ఆయన సంబంధం వెనుక ఉన్న రహస్యం, వైశ్రాయ్ ఉదంతం వెనుక ఉన్న అత్యంత నీచమైన కుట్రలు, ఎన్టీఆర్ చివరి రోజుల్లో బోరుబోరున ఏడ్చి పడిన కుమిలిపాటిని కూడా ఈ సినిమాలో వివరంగా చూపించబోతున్నామని'' వర్మ తెలిపారు. 

''ఎన్టీఆర్ గారిని మోసం అనే విషం పూసి వెన్నుపోటు కత్తితో పొడిచి చంపారు. ఆ మహా మనిషి ఎన్టీఆర్ గారి చావుకి కారణమైన ప్రతీ ఒక్కరినీ కోర్టులో నిలబెట్టడానికి మీ అభిమాన థియేటర్లలో ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ప్రపంచం యావత్తు ఉన్న తెలుగు ప్రజలే ఈ సినిమాకి న్యాయనిర్ణేతలు'' అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.  

 

PREV
click me!

Recommended Stories

Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా