'నరకాసురుడు' మూవీ ఫస్ట్ లుక్!

Published : Feb 15, 2019, 02:57 PM IST
'నరకాసురుడు' మూవీ ఫస్ట్ లుక్!

సారాంశం

తమిళ నటుడు అరవింద్ స్వామికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా కాలం తరువాత 'ధృవ' సినిమాలో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు అరవింద్ స్వామీ. ఇప్పుడు మరో సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

తమిళ నటుడు అరవింద్ స్వామికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా కాలం తరువాత 'ధృవ' సినిమాలో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు అరవింద్ స్వామీ. ఇప్పుడు మరో సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దర్శకుడు కార్తిక్ నరేన్ రూపొందిస్తోన్న'నరగసూరన్' సినిమాలో అరవింద్ స్వామీ విలన్ గా కనిపించనున్నారు.'నరకాసురుడు' అనే పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.

క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సందీప్ కిషన్, శ్రియా శరన్, ఇంద్రజిత్ సుకుమారన్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను తెలుగులో కోనేరు సత్యనారాయణ విడుదల చేయనున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?