`సర్కారువారిపాట` ట్యాగ్‌ పెడితే అమ్మ అన్నం పెట్టనన్నదా?.. నెటిజన్‌కి గుబ గుయ్‌మనిపించిన థమన్‌!

Published : Apr 11, 2021, 08:06 AM IST
`సర్కారువారిపాట` ట్యాగ్‌ పెడితే అమ్మ అన్నం పెట్టనన్నదా?.. నెటిజన్‌కి గుబ గుయ్‌మనిపించిన థమన్‌!

సారాంశం

మహేష్‌కి సంగీత దర్శకుడు థమన్‌  ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. `లాట్స్ ఆఫ్‌ లవ్‌ టు మా సూపర్‌ స్టార్‌ మహేష్‌. బ్లాక్‌బస్టర్‌ వకీల్‌సాబ్‌` అని బ్లాక్‌బస్టర్‌, వకీల్‌సాబ్‌ ట్యాగ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఓ అభిమాని మాత్రం ఈ పోస్ట్ కి హర్ట్ అయ్యాడట. 

పవన్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ సైతం సినిమాని, పవన్‌ కళ్యాణ్‌ని అభినందించారు. పవన్‌ బాగా చేశాడని, థమన్‌ సంగీతం అద్భుతం అని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి చిత్ర బృందం థ్యాంక్స్ చెప్పింది. వారితోపాటు సంగీత దర్శకుడు థమన్‌ కూడా ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. `లాట్స్ ఆఫ్‌ లవ్‌ టు మా సూపర్‌ స్టార్‌ మహేష్‌. బ్లాక్‌బస్టర్‌ వకీల్‌సాబ్‌` అని బ్లాక్‌బస్టర్‌, వకీల్‌సాబ్‌ ట్యాగ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఓ అభిమాని మాత్రం ఈ పోస్ట్ కి హర్ట్ అయ్యాడట. 

థమన్‌.. మహేష్‌కి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్‌ చేసిన పోస్ట్ లో `సర్కారువారిపాట` యాష్‌ ట్యాగ్‌ని ట్యాగ్‌ చేయనందుకు కామెంట్‌ చేశాడు. `సర్కారువారిపాట`ని ట్యాగ్‌ చేస్తే అమ్మ అన్నం పెట్టనన్నదా బ్రో` అని కామెంట్‌ చేశాడు. దీంతో మండిపోయిన థమన్‌ ఆ నెటిజన్‌కి కౌంటర్‌తో గుబ గుయ్‌మనిపించాడు. `బ్రో మా అమ్మగారు అన్నం పెట్టడం పక్కన పెడితే. నేను మా అమ్మగారుకి 27ఏళ్లుగా అన్న పెట్టి జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నా. ముందు మీ అమ్మగారికి చెప్పు నీకు మంచి బుర్ర పెరిగేలా కురగాయలతో వంటి చేసి పెట్టమని` అని కౌంటర్‌ ఇచ్చాడు థమన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనికి అభిమానులు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

మహేష్‌ ప్రస్తుతం `సర్కారువారిపాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కరోనా వల్ల  ఫారెన్‌ వెళ్లాల్సిన షెడ్యూల్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది చిత్ర బృందం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్