పవన్‌.. పవర్‌ ప్యాక్డ్ పర్‌ఫెర్మెన్స్ ః `వకీల్‌సాబ్‌`పై మహేష్‌ ప్రశంసలు

Published : Apr 11, 2021, 07:35 AM IST
పవన్‌.. పవర్‌ ప్యాక్డ్ పర్‌ఫెర్మెన్స్ ః `వకీల్‌సాబ్‌`పై మహేష్‌ ప్రశంసలు

సారాంశం

చిరంజీవి `వకీల్‌సాబ్‌` సినిమా చూసి పవన్‌ని, చిత్ర యూనిట్‌ని అభినందించారు. తాజాగా మహేష్‌ బాబు సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పవన్‌ని ఆయన పొగడ్తలతో ముచ్చెత్తడం విశేషం. మంచు మనోజ్‌ కూడా అభినందించారు.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` విజయవంతంగా రన్‌ అవుతుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్‌ 9న సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. ఈ సినిమాపై సినీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా వాళ్లే కాదు రాజకీయ నాయకులు సైతం పార్టీలకు అతీతంగా ఈ చిత్రాన్ని అభినందిస్తుండటం విశేషం. 

చిరంజీవి `వకీల్‌సాబ్‌` సినిమా చూసి పవన్‌ని, చిత్ర యూనిట్‌ని అభినందించారు. తాజాగా మహేష్‌ బాబు సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పవన్‌ని ఆయన పొగడ్తలతో ముచ్చెత్తడం విశేషం. ఆయన చెబుతూ, `పవన్‌ టాప్‌ ఫామ్‌లోకి వచ్చారు.  `వకీల్‌సాబ్‌`లో పవర్‌ ప్యాక్డ్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారు. ప్రకాష్‌రాజ్‌ బ్రిలియంట్‌గా చేశారు. అమ్మాయిలు నివేదా, అంజలి, అనన్య హార్ట్ టచ్చింగ్‌ నటనని ప్రదర్శించారు. థమన్‌ మ్యూజిక్‌ అద్భుతం. దర్శకుడు వేణు శ్రీరామ్‌, దిల్‌రాజు, శృతి హాసన్‌, పీఎస్‌ వినోద్‌, బోనీ కపూర్‌లకు అభినందనలు` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. 

దీనికి స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నివేదా థామస్‌, అనన్య.. మహేష్‌కి థ్యాంక్స్ చెప్పారు. మంచు మనోజ్‌ సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే సినిమాకి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వస్తోన్న ఓపెనింగ్స్ ని, ఓవరాల్‌గా కలెక్షన్లని మాత్రం చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్