
హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదం బారినపడి ఇరవై రోజులు కావస్తుంది. సెప్టెంబర్ 10న బైక్ ప్రమాధానికి గురైన సాయి ధరమ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం అపోలో ఆసుపత్రి వర్గాలు, సాయి ధరమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శరీరంలోని ప్రధాన అవయవాలకు ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అన్నారు. తర్వాత రెండు రోజులు సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన వైద్యులు తరువాత ఆపేశారు.
దీనితో అసలు సాయి ధరమ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే సందేశం మెగా ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. ఇక రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. సాయి ధరమ్ ఇంకా కోమాలోనే ఉన్నారని చెప్పి, పెద్ద షాక్ ఇచ్చారు. దీనితో అభిమానులలో ఆందోళన పెరిగిపోయింది. అయితే నాగబాబు, రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ దేవా కట్టా సాయి ధరమ్ కోలుకుంటున్నారని, స్వయంగా ఆహారం తీసుకుంటున్నారని వెల్లడించారు.
తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ ద్వారా సాయి ధరమ్ హెల్త్ అప్డేట్ ఇచ్చారు.మీ ప్రార్ధనలు ఫలించాయి. నా మిత్రుడు కోలుకుంటున్నారు. త్వరలోనే నేను కలవబోతున్నాను అంటూ, ట్వీట్ చేశారు. థమన్ ట్వీట్ సాయి ధరమ్ ఫ్యాన్స్ కి పెద్ద ఉపశమనం కలిగించింది. ప్రమాదం జరిగిన రోజు, ఆ తరువాత మాత్రమే సాయి ధరమ్ వీడియోలు, ఫోటోలు బయటికి వచ్చాయి. ఆపై అపోలో వర్గాలు సాయి ధరమ్ ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నారు.