పొంగల్ బరిలో అలియా భట్ గంగూబాయ్ కతియావాడి

Published : Sep 30, 2021, 03:32 PM ISTUpdated : Sep 30, 2021, 03:41 PM IST
పొంగల్ బరిలో అలియా భట్ గంగూబాయ్ కతియావాడి

సారాంశం

గంగూభాయ్ కతియావాడి(Gangubhai kathiawadi) మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 6, 2022న పొంగల్ కానుకగా గంగూభాయ్ కతియావాడి విడుదల కానుంది.

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం గంగూభాయ్ కతియావాడి. ముంబై నగరంలో జరిగిన యదార్ధ సంఘటల ఆధారంగా నిర్మితం అవుతుంది. టైటిల్ రోల్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 


కాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 6, 2022న పొంగల్ కానుకగా గంగూభాయ్ కతియావాడి విడుదల కానుంది. ముంబై వ్యభిచార గృహాలకు అమ్మివేయబడిన బాలిక, కాలక్రమంలో తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగింది అన్నదే ఈ చిత్ర కథాంశం. ఓ ఛాలెంజింగ్ రోల్ అలియా ఎలా చేస్తారో చూడాలనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొని ఉంది. 


దర్శకుడు సంజయ్ లీలా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అలాగే సాంగ్స్ కి స్వరాలు సమకూర్చారు. పెన్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత జయంతి లాల్ గడ మరో నిర్మాతగా ఉన్నారు. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ లో సీతగా రామ్ చరణ్ ప్రేయసి పాత్ర చేస్తున్నారు అలియా. ఆర్ ఆర్ ఆర్ కూడా సంక్రాంతి బరిలో దిగనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కనుక నిజం అయితే, రోజుల వ్యవధిలో అలియా నుండి రెండు భారీ పీరియాడిక్ చిత్రాలు విడుదల కానున్నాయన్నమాట. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్