డిప్రెషన్‌తో ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌

Published : Sep 30, 2021, 02:43 PM IST
డిప్రెషన్‌తో ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌

సారాంశం

ప్రముఖ కన్నడ సీరియల్‌ నటి సౌజన్య(tv actress soujanya) ఆత్మహత్య(suicide) చేసుకుంది. గురువారం ఆమె బెంగుళూరులోని తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. డిప్రెషన్‌ కారణంగానే తాను ఆత్మహత్యకి పాల్పడుతున్నట్టు తెలిపింది.

ప్రముఖ కన్నడ సీరియల్‌ నటి సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్‌తో పోరాడుతూ తాను సూసైడ్‌కి పాల్పడింది. గురువారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు శాండల్‌వుడ్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. కన్నడ సీరియల్స్ తో పాపులర్‌ అయిన సౌజన్యం గురువారం బెంగుళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడింది. సీలింగ్‌ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. 

అయితే తాను ఆత్మహత్యకి పాల్పడిన సందర్భంగా ఆమె ఓ సూసైడ్‌ నోట్‌ని పంచుకుంది. ఇందులో తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. తాను డిప్రెషన్‌కి గురైనట్టు, తీవ్రమైన దశకు చేరుకున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఆమె ఆత్మహత్యకి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. కొడగు జిల్లాలోని కుళల్‌ నగర్ కి చెందిన సౌజన్య అనేక సీరియల్స్ లో నటించింది. రెండు కన్నడ సినిమాలు కూడా చేసింది.

నటి మూడు రోజుల క్రితం డెత్‌ నోట్‌ రాసిందని, డిప్రెషన్‌ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ణారిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని రాజరాజేశ్వి వైద్య కళాశాలకు తరలించారు. నటి సౌజన్య మృతి పట్ల కన్నడ టీవీ పరిశ్రమ, చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?