సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కు థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ పై అప్డేట్ అందించారు. ఈమేరకు ఓ డేట్ ను కూడా వెల్లడించారు.
మహేశ్ బాబు ఫ్యాన్స్ కు వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ఎప్పడు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఎస్ఎస్ఎంబీ28’ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా ఫైనల్ చేయడంతో అందుకు తగ్గట్టుగానే చిత్రీకరణ పనులు కొనసాగుతున్నాయి.
అయితే, ఉగాది సందర్భంగా చిత్రం నుంచి మహేశ్ ఫ్యాన్స్ కు మేకర్స్ డబుల్ ట్రీట్ అందించారు.కేవలం చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని భావించిన ఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు. పండుగ సందర్భంగా వచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్ కు అభిమానులు ఖుషీ అవుతున్నారు. మహేశ్ మాస్ గా, సరికొత్త లుక్ లో ఆకట్టుకుండటంతో నెక్ట్స్ అప్డేట్స్ పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) క్రేజీ అప్డేట్ అందించారు. ఎస్ఎస్ఎంబీ28 మ్యూజిక్ రెడీ అవుతుందని ట్వీటర్ వేదికన రివీల్ చేశారు.
తాజాగా థమన్ చేసిన ట్వీట్ ‘ఎస్ఎస్ఎంబీ28’ మ్యూజిక్ పై ఆసక్తిని పెంచుతోంది. ముందుగానే డేట్ ఫిక్స్ చేసి థమన్ పని మొదలెట్టినట్టు తెలుస్తోంది. ‘మే 31న’ SSBM28 మోత మోగిపోతుందనేలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం థమన్ ట్వీట్ వైరల్ గా మారింది. అదే రోజు దివంగత సూపర్ స్టార్ క్రిష్ణ పుట్టినరోజు కావడంతో సాలిడ్ అప్డేట్ కన్ఫమ్ అయ్యిందని థమన్ పోస్ట్ తో అర్థమవుతోంది. ఇక అదేరోజు ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక థమన్ నుంచి అప్డేట్ అందడంతో మ్యూజిక్ ఉంటుందని తెలుస్తోంది. చివరిగా మహేశ్ బాబు - కీర్తి సురేష్ జంటగా వచ్చిన ‘సర్కారు వారి పాట’కు కూడా థమనే మ్యూజిక్ అందించారు. ‘కళావతి’.. ‘మా మా మహేశా’.. వంటి సాంగ్స్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఎస్ఎంబీ28కి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నారోనని ఎదురుచూస్తున్నారు.
కానీ థమన్ ఇచ్చే అప్డేట్ రావాలంటే ఇంకా రెండు నెలలు వేచి ఉండక తప్పదు. ఈలోపు మరేదైనా అప్డేట్ వస్తుందోనని ఆసక్తిగా ఉన్నారు. చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde), శ్రీలీలా ఆడిపాడనున్నారు. పలువురు స్టార్ కాస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో అలరించనున్నారు. 2024 జనవరి 14న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
MAY31st 🔥 🤙🥁 pic.twitter.com/Znk9hRzcM0
— thaman S (@MusicThaman)