పందిపిల్లతో పాదయాత్ర.. వాటే ప్రమోషన్స్!

Published : Nov 01, 2018, 06:53 PM IST
పందిపిల్లతో పాదయాత్ర.. వాటే ప్రమోషన్స్!

సారాంశం

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించాలని తాపత్రయపడే ఫిల్మ్ మేకర్స్ లో రవిబాబు కూడా ఒకరు. 

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించాలని తాపత్రయపడే ఫిల్మ్ మేకర్స్ లో రవిబాబు కూడా ఒకరు. ఇకపోతే ఆయన గత కొంత కాలంగా పంది పిల్లతో అదుగో అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

ఆ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. సినిమా కోసం రవిబాబు ఒక పందిపిల్లను పెంచుకొని దానితోనే షూటింగ్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ పంది పిల్లతో పాదయాత్ర అంటూ అందరిని ఆకట్టుకునే విధంగా రవిబాబు ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు రేపు సాయంత్రం 3గంటల 30నిమిషాలకు పాదయాత్ర మొదలు కానుందని ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో నెటిజన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తుంటారు. ఇక డైరెక్షన్ తో పాటు రవిబాబు సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సురేష్ బాబు సమర్పణలో సినిమా రిలీజ్ కానుంది.

PREV
click me!

Recommended Stories

రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. హీరోకి తీవ్ర అవమానం, కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్
Ram Charan : చిరంజీవి కొడుకుగా పుట్టడం భారమా? రామ్ చరణ్ కీలక కామెంట్స్