తిరుమలలో హీరోయిన్  శ్రీలీల బుగ్గ గిల్లిన ఎస్ ఎస్ థమన్!

Published : Jun 26, 2024, 03:41 PM IST
తిరుమలలో హీరోయిన్  శ్రీలీల బుగ్గ గిల్లిన ఎస్ ఎస్ థమన్!

సారాంశం

హీరోయిన్ శ్రీలీల బుగ్గ గిల్లాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. అది కూడా తిరుమలలో. థమన్ తీరు విమర్శల పాలవుతుంది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

అనాలోచితంగా చేసే కొన్ని పనులు ఒక్కోసారి వివాదానికి దారి తీస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అలాగే బుక్ అయ్యాడు. తిరుమలలో ఆయన హీరోయిన్ శ్రీలీల బుగ్గ గిల్లడం వివాదాస్పదం అయ్యింది. సోషల్ మీడియాలో థమన్ ని తిట్టిపోస్తున్నారు. విషయంలోకి వెళితే... తల్లితో పాటు తిరుమల వచ్చిన శ్రీలీల శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చారు. అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సైతం స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. 

శ్రీలీల, థమన్ ఎదురుపడ్డారు. దాంతో పలకరింపులు చోటు చేసుకున్నాయి. శ్రీలీల తల్లిని థమన్ కి పరిచయం చేసింది. ఈ క్రమంలో శ్రీలీల బుగ్గను గిల్లాడు థమన్. ఆయన ఉద్దేశం ఏదైనా కానీ, పవిత్ర తిరుమల గుడి ఆవరణలో బుగ్గ గిల్లడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థమన్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. కొందరైతే ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అది ఏమంత విమర్శించాల్సిన విషయం కాదు. శ్రీలీలను థమన్ అసభ్యంగా తాకలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

తరచుగా థమన్ వివాదాల్లో ఉంటున్నారు. ఆయన సాంగ్స్ పలుమార్లు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఏకంగా యూట్యూబ్ నుండి కూడా ఆయన ట్యూన్స్ లేపేసిన సందర్భాలు ఉన్నాయి. క్రాక్ చిత్రంలోని ఓ సాంగ్ ట్యూన్ యూట్యూబ్ నుండి మక్కీకి మక్కీ దించాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ టీజర్ బీజీఎమ్ సైతం థమన్ ఓ యూట్యూబ్ ఛానల్ నుండి కాపీ చేయడం కొసమెరుపు. 

PREV
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో