అల్లు శిరీష్‌కి టెడ్డీ బేర్‌ లైఫ్‌ ఇస్తుందా?.. `బడ్డీ` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Published : Jun 26, 2024, 12:15 PM IST
అల్లు శిరీష్‌కి టెడ్డీ బేర్‌ లైఫ్‌ ఇస్తుందా?.. `బడ్డీ` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

సారాంశం

అల్లు శిరీష్‌ హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్‌ అవుతున్నాడు. సరైన బ్రేక్‌ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన టెడ్డీ బేర్‌ని నమ్ముకుని వస్తున్నాడు. మరి అది లైఫ్‌ ఇస్తుందా?  

అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్‌ వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు అల్లు శిరీష్‌. 2013లో `గౌరవం` సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రశంసలందుకున్నారు. `కొత్త జంట`తో ఆకట్టుకున్నాడు. `శ్రీరస్తు శుభమస్తు` చిత్రంతో హిట్‌ అందుకున్నారు. ఇక అల్లు శిరీష్‌ హీరోగా గాడిలో పడ్డట్టే అనుకున్నారు. కానీ `ఒక్క క్షణం` బెడిసికొట్టింది. మలయాళంలో చేసిన `1971`, తెలుగులో నటించిన `ఏబీసీడీ` నిరాశ పరిచాయి. చివరగా `ఊర్వశివో రాక్షసివో` చిత్రంతో వచ్చాడు. ఇది యావరేజ్‌గా ఆడింది. కానీ శిరీష్‌కి హిట్‌ ఇవ్వలేకపోయింది. 

హిట్‌ కోసం ఇప్పుడు శిరీష్‌ టెడ్డీ బేర్‌ని నమ్ముకున్నాడు. టెడ్డీ బేర్‌ మెయిన్‌ పాత్రతో రూపొందిన `బడ్డీ` చిత్రంలో నటించాడు. ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. టెడ్డీ బేర్‌ ప్రధానంగా ఈ ట్రైలర్‌ సాగింది. దానికి కష్టం వస్తే, అదే న్యాయం కోసం పోరాడాల్సి వస్తే ఏం చేసింది, హీరో శిరీష్‌ సహాయంతో ఎలా పోరాడింది? ఎవరిపై పోరాడారు, ఎందుకు పోరాడాల్సి వచ్చిందనేది ట్రైలర్‌లో ఆకట్టుకుంది. కాస్త ఫన్‌, కాస్త గ్లామర్‌, ఇంకాస్త యాక్షన్‌, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలతో మేళవింపుతో సినిమా తెరకెక్కిందని అర్థమవుతుంది. 

`బడ్డీ` చిత్రంలో అల్లు శిరీష్‌ హీరోగా నటించగా, టెడ్డీ బేర్‌ కీలకపాత్ర పోషిస్తుంది. గాయత్రి భరద్వాజ్‌, ప్రిషారాజేష్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్‌ ఫిల్మ్స్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి శిరీష్‌కి టెడ్డీ బేర్‌ లైఫ్‌ ఇస్తుందా? అనేది చూడాలి. 

ఇక ట్రైలర్‌ విడుదల సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ, లాస్ట్ ఇయర్ `బడ్డీ ` పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా అని అడిగారు. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా. `బడ్డీ` విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ ఇవాళ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా. నా హీరోయిజం చూపించాలని కాదు. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్‌ గారు` అని చెప్పారు అల్లు శిరీస్‌. ఇందులో టీమ్‌ పాల్గొని సంతోషాన్ని, సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలిపారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్