విలన్ గా నటించబోతున్న సంగీత దర్శకుడు కోటి, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

By Mahesh JujjuriFirst Published Aug 14, 2022, 2:13 PM IST
Highlights

సంగీత దర్శకుడిగా సుధీర్ఘకాల ఎన్నో సూపర్ హిట్స్ సాధించిన కోటి.. ఇక నటనపై దృష్టి పెట్టారు. సినిమాలకు సైన్ చేసేస్తున్నారు.  రీసెంట్ గా ఆయన విలన్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. 

సంగీత దర్శకుడిగా సుధీర్ఘకాల ఎన్నో సూపర్ హిట్స్ సాధించిన కోటి.. ఇక నటనపై దృష్టి పెట్టారు. సినిమాలకు సైన్ చేసేస్తున్నారు.  రీసెంట్ గా ఆయన విలన్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. 

సీనియర్‌ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా కనిపించబోతున్నాడు. దీపికా, ఆరాధ్య జంటగా  రవిశ్రీ దుర్గాప్రసాద్‌ దర్శకత్వం రూపొందుతున్న సినిమా పగ పగ పగ. ఈ సినిమాలో కోటీ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
సంగీత దర్శకుడు కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకుడు మోహర్‌ రమేష్‌ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామంటున్నారు టీమ్. 

రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన  సినిమా పోస్టర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్  చేయించారు. మోషన్ పోస్టర్ అద్బుతంగా ఉంది..  డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కోటి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, లుక్‌తో అందరినీ మెప్పించారు. హలో పెజ్జోని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసి చస్తాడు అంటూ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. 

ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందిఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు లాంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించడంతో పాటు..మూవీకి సంగీతం కూడా కోటీనే అందించారు. సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.

click me!