Keeravani: రాజమౌళి-కీరవాణి ఇంట తీవ్ర విషాదం!

Published : Dec 14, 2022, 03:52 PM ISTUpdated : Dec 14, 2022, 03:53 PM IST
Keeravani: రాజమౌళి-కీరవాణి ఇంట తీవ్ర విషాదం!

సారాంశం

సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లిగారు కన్నుమూశారు.   

సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కీరవాణి తల్లిగారు కన్ను మూశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నేడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన్నాళ్లుగా కీరవాణి తల్లి వయోసంబంధింత రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వయసు రీత్యా వైద్యానికి ఆమె స్పందించలేదని సమాచారం.

తల్లి మరణంతో కీరవాణి తీవ్ర వేదనకు గురయ్యారు. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని కీరవాణి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతి వార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 

దర్శకుడు రాజమౌళి(Rajamouli) కీరవాణికి కజిన్ అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు. శివ శక్తి దత్త కూడా పరిశ్రమకు చెందినవారే. ఆయన స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్ కూడాను. అలాగే ప్రొఫెషనల్ పెయింటర్. తండ్రి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా కీరవాణి సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. ఆయన రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కావడం విశేషం. రాజమౌళి మొదటి చిత్రం నుండి ఆర్ ఆర్ ఆర్ వరకు కీరవాణి ఆయన సినిమాలకు మ్యూజిక్ అందించారు. 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?