ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి చివరి కోరికను ఆయన తమ్ముడు మహిత్ నారాయణ్ తీర్చారు. రీసెంట్ ఇంటర్వ్యూలో తన అన్న కోసం ఏం చేశారో మహిత్ వెల్లడించారు. అన్న బాటలోనే నడుస్తున్నట్టు తెలిపారు.
సంగీత ప్రియులందరికీ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, దివంగత చక్రి (Chakri) ఎంతో సుపరిచితుడు. ఇప్పటికీ ఆయన తెలుగు సినిమాలకు అందించిన సూపర్ హిట్ సాంగ్స్ కు అభిమానులు ఉన్నారు. నేటికీ ఆయన పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్షన్ లో తనదైన శైలిని చూపించి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు చక్రి. 2016 డిసెంబర్ లో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం చక్రిని భర్తీ చేసేందుకు ఆయన స్థానంలో అతని తమ్ముడు మహిత్ నారాయణ్ (Mahit Narayan) వచ్చారు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలను సాంగ్స్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు.
రీసెంట్ గా మహిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబ పరిస్థితులను, తన అన్న గురించి స్పందించారు.... ’మా అన్నయ్య చనిపోవడం చాలా పెద్ద లేటు. అన్న ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తెలియలేదు. ఇప్పుడిప్పుడు మళ్లీ సర్దుకుంటున్నాయి. నేను సొంత స్టూడియో పెట్టి అవకాశాలకు ఎదురుచూస్తున్నాను. ఈ స్టూడియో అన్న చక్రి డ్రీమ్. ఎప్పటికైనా ‘c’ స్టూడియో పెట్టాలని ఆశించారు. కానీ కుదర్లేదు. దాంతో నేను స్టూడియో పెట్టి సీ స్టూడియోస్ పేరు పెట్టాం. సీ- అంటే చిరంజీవి అని అర్థం. అన్న చక్రికి చిరంజీవి అంటే చాలా ఇష్టం. స్ఫూర్తి కూడానూ. అందుకే ఆయన కోరిక మేరకు ఈ స్టూడియో పెట్టాను‘ అంటూ వివరించారు.
చక్రి చిరంజీవికి వీరాభిమాని. ఆయన కేరీర్ ప్రారంభంలో చిరు బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ ను రికార్డు చేసి వినిపించారు. అలా మెగాస్టార్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత నుంచి చక్రి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే మహిత్ కూడా తన అన్న చక్రి వద్దనే సంగీతం నేర్చుకున్నారు. తనకు ఇష్టం లేకపోయినా.. చక్రి వారసుడిగా ఉండాలనే అన్న కోరిక మేరకు సంగీతం నేర్చుకున్నారంట. ఇదే విషయాన్ని మహిత్ లెటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చక్రికి చిరంజీవి అంటే చాలా ఇష్టమని, తనకు చిరు తనయుడు చరణ్ అంటే చెప్పలేనంత ప్రేమ, అభిమానం ఉందన్నారు.
ఇక మహిత్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం ఆఫర్లను అందుకుంటున్న తెలుస్తోంది. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పరారి’ చిత్రానికి మహిత్ నే సంగీతం అందించారు. అలాగే మరిన్ని సినిమాలకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారు. అదేవిధంగా ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) పుట్టిన రోజు వేడుకల సందర్భంగానూ.. వేదికపై చరణ్ పై స్పెషల్ సాంగ్ ను పాడి ఆకట్టుకుంటున్నారు. ఇందుకు చెర్రీ నుంచి ప్రశంసలు కూడా పొందారు. ఏడాది కింద కూడా చరణ్ మహిత్ పట్ల భరోసా వ్యక్తం చేశారు.