బర్త్ డే పార్టీలో సూపర్ హాట్ గా బన్నీ వైఫ్ స్నేహారెడ్డి... షార్ట్ మిడ్డీలో చూసి జనాల మైండ్ బ్లాక్!

Published : Mar 31, 2023, 05:37 PM ISTUpdated : Mar 31, 2023, 05:47 PM IST
బర్త్ డే పార్టీలో సూపర్ హాట్ గా బన్నీ వైఫ్ స్నేహారెడ్డి... షార్ట్ మిడ్డీలో చూసి జనాల మైండ్ బ్లాక్!

సారాంశం

అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించారు. ఆమె ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా ఉన్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   


అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా ఫ్రీక్. ఆమె అభిమానులతో ప్రతి విషయం షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో ఎనిమిది మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు స్నేహారెడ్డి సోషల్ మీడియాను అంతగా పట్టించుకునేవారు కాదు. గత రెండేళ్లుగా ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన అభిరుచులను గౌరవించే అల్లు అర్జున్ ప్రోత్సహిస్తున్నారు. 

కాగా అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ టూర్ లో ఉన్నారు. స్నేహారెడ్డి క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం ఈ జంట సన్నిహితులతో కలిసి ఫారిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. వీరితో రామ్ చరణ్ సిస్టర్స్ శ్రీజా, సుస్మిత కూడా జాయిన్ అయ్యారు. స్నేహారెడ్డి ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. బర్త్ డే పార్టీకి స్నేహారెడ్డి ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. షార్ట్ మిడ్డీ ధరించిన స్నేహారెడ్డి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించారు. స్నేహారెడ్డి గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. 

తరచుగా స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆమెకు ఫిట్నెస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్.  ఈ విషయంలో అల్లు స్నేహారెడ్డిని మెచ్చుకోవాల్సిందే. ఒక ప్రక్క భార్యగా తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూనే చక్కని శరీరాకృతి కొనసాగిస్తున్నారు. దానికి కారణం... అందం ఆరోగ్యం మీద ఆమెకు ఉన్న శ్రద్ధ. కాగా 2023కి స్నేహారెడ్డి తన ఫిట్నెస్ గోల్స్ మార్చేస్తున్నారు. ఇకపై తన లక్ష్యాలు ఇవి అంటూ ఆమె వీడియో విడుదల చేశారు. 

బరువు తగ్గడం కాదు శక్తివంతం కావాలనుకుంటున్నారట. భౌతిక ఆరోగ్యానికి బదులు ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనుకుంటున్నారట. తక్కువ తినడం కాదు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని గ్రహించారట. ఒకేసారి కఠిన కసరత్తులు చేయకుండా క్రమం తప్పకుండా చేయాలనుకుంటున్నారట. సన్నబడటం కాకుండా ధృడంగా తయారు కావాలనుకుంటున్నారట. ఈ విషయాలు తెలియజేస్తూ స్నేహారెడ్డి వర్క్ అవుట్ వీడియో విడుదల చేశారు. అది వైరల్ అయ్యింది. 

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ గ్యాప్ లో భార్యతో పాటు వెకేషన్ కి వెళ్లారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. పుష్ప విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో