
తమిళ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ కు ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. తమిళంలో పెద్ద సినిమాలు అన్ని ఆయనే చేస్తున్నారు. వరస బ్లాక్ బస్టర్ పాటులు ఇస్తున్నారు. సినిమా ప్లాఫ్ అయినా పాటలు నిలిచిపోతున్నాయి. రీసెంట్ గా విజయ్ తో చేసిన బీస్ట్ సినిమాకు అదే జరిగింది. అనిరిధు పాటలు..సినిమా కంటే ముందే ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూంటాయి. ఆయన మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అవటంతో సినిమా మీద బజ్, హైప్ ఎక్కువ క్రియేట్ అవుతోంది. ఇలా హైప్ క్రియేట్ చెయ్యడంలో నంబర్ వన్ అనిరుద్. తమిళ్ లో అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుగులో మాత్రం ఇంకా క్లిక్ కాలేదు. అయితే తమిళ్ లోలానే తెలుగులో కూడా తన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చెయ్యడానికి ఈ సారి వచ్చిన ఛాన్సులని వదులుకోకూడదు అనుకుంటున్నాడు.
గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలు చేసినా ఫర్వాలేదనిపించాడు కానీ సాలిడ్ మ్యూజిక్ హిట్ మాత్రం అనిరుధ్ కి దక్కలేదు. ఇవన్ని ప్రక్కన పెడితే ఆయన తాజాగా విక్రమ్ సినిమా గురించి చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. లేటెస్ట్ గా మళయాళ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యినప్పుడు అనిరుధ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. “కమల్ హాసన్ ... విక్రమ్ సూపర్ హిట్టైన నేపధ్యంలో డైరక్టర్ లోకేష్ కనకరాజ్ కు Lexus car ని గిప్ట్ గా ఇచ్చారు. అలాగే సినిమాలో కీలకంగా నిలిచిన సూర్యకి కాస్ట్లీ వాచ్ ఇచ్చి సత్కరించారు. మీకేం గిప్ట్ ఇచ్చారు?” అని జర్నలిస్ట్ అడిగారు. దానికి అనిరుధ్ సమాధానం ఇస్తూ... “నాకు విక్రమ్ సినిమా ఇవ్వటమే పెద్ద గిప్ట్.” అన్నారు. ఇప్పుడీ కామెంట్ తెగ వైరల్ అవుతోంది.
కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత 'విక్రమ్'తో బిగ్ బ్యాంగ్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన అభిమానులకు ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించి సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఈ స్థాయి హిట్ ని ఊహించని కమల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సూర్యకు రోలెక్స్ వాచ్.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు అత్యంత ఖరీదైన కారు. చిత్ర బృందంలోని డైరెక్షన్ టీమ్ కు బైక్ లు.. ఇలా ప్రతీ ఒక్కరికి గిఫ్ట్ లతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఇక తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ హీరోలు ఏరి కోరి మరి అనిరుధ్ మాత్రమే కావాలంటున్నారు. తెలుగులోనూ ఎన్టీఆర్ – కొరటాల శివ, రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి వంటి క్రేజీ కాంబోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు అనిరుధ్.