Radhe Shyam:'రాధేశ్యామ్‌'డైరక్టర్ నెక్ట్స్ ఖరారైనట్లేనా? హీరో అతనా?

By Surya Prakash  |  First Published Jun 16, 2022, 9:26 AM IST

ప్ర‌భాస్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్గా నిల‌వ‌డంతో పాటు భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా అతి చెత్త రికార్డు న‌మోదు చేసింది.ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడు నెక్ట్స్  ఎక్కడ, ఏ హీరోతో చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.



యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా – పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్‌. పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాయి. మార్చి 11న భారీ అంచనాల‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ సినిమాలు, సాహో త‌ర్వాత వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను పూర్తిగా నిరాశ ప‌రిచింది. అతి పెద్ద డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. 

210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా ఫైన‌ల్‌గా రు 83.12 కోట్ల షేర్ సాధించింది. అంటే ఓవ‌రాల్గా ఈ సినిమా రు. 126 కోట్ల భారీ న‌ష్టంతో సినిమా కొన్న బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేసింది. ప్ర‌భాస్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్గా నిల‌వ‌డంతో పాటు భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా అతి చెత్త రికార్డు న‌మోదు చేసింది.ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడు నెక్ట్స్  ఎక్కడ, ఏ హీరోతో చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే గోపిచంద్ తోనే మరో కథ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు గోపి కోసం ఓ స్టోరీలైన్ ని రెడీ చేసారట. ఇప్పుడు గోపీచంద్ తన తాజా చిత్రం పక్కా కమర్షియల్ రిలీజ్ తర్వాత చూద్దామని చెప్పారట.

Latest Videos

అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు రాధా కృష్ణ కుమార్ పై నిర్మాతలు యువి వారు నమ్మకం కోల్పోలేదట. గోపిచంద్ జిల్ తో పరిచయమైన ఈ దర్శకుడు...ఆ సినిమా యావరేజ్ అనిపించుకున్నా నెక్ట్స్ ప్రభాస్ తో ఆఫర్ సంపాదించారు. ఆ రెండు సినిమాలు యువిలోనే చేసారు. ఇప్పుడు మరో సినిమాని సైతం అదే బ్యానర్ లో ఇస్తున్నట్లు వినికిడి. సినిమా ఫెయిల్యూర్ అయినా అతని హార్డ్ వర్క్ కు, డెడికేషన్ కు నిర్మాతలు ఈ సినిమా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా స్క్రిప్టు దశలోనే ఉందని, ఇంకా ఫైనల్ కాలేదని చెప్తున్నారు. అలాగే ఇందులో చేసే హీరో ఎవరనేది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి టాక్స్ జరుగుతున్నాయని, అన్ని సెట్ అయితే త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉందని చెప్తున్నారు.

రాధే శ్యామ్ చిత్రం యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్తసాముద్రికా నిపుణుడిగా ప్ర‌భాస్, ఆయ‌న ప్రేయ‌సి ప్రేర‌ణ‌గా పూజా న‌టించారు. అనేక అడ్డంకుల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం మార్చి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ అయింది. కానీ, ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను ఈ మూవీ ఏ మాత్రం రీజ్ కాలేక‌పోయింది. ప్ర‌భాస్ న‌ట‌న, విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మిన‌హా.. పెద్దగా ఆక‌ర్షించే అంశాలు ఏమీ ఈ సినిమాలో ఉండ‌వు. అయితే ప్ర‌భాస్‌కు ఉన్న క్రేజ్ దృష్యా మొద‌టి మూడు రోజులు బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ.. ఆ త‌ర్వాత పూర్తిగా డ‌ల్ అయిపోయింది. మొత్తానికి రాధేశ్యామ్‌తో ప్ర‌భాస్ త‌న ఖాతాలో మ‌రో బిగ్ డిజాస్ట‌ర్‌ను వేసుకున్నారు.

click me!