Krishna Mukunda Murari: భయంతో వణికిపోతున్న మురారి.. కృష్ణని ఇరికించేసిన ముకుంద!

Published : Feb 27, 2023, 01:30 PM IST
Krishna Mukunda Murari: భయంతో వణికిపోతున్న మురారి.. కృష్ణని ఇరికించేసిన ముకుంద!

సారాంశం

Krishna Mukunda Murari: అందమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతున్న సీరియల్ కృష్ణ ముకుందా మురారి. ఇక ఈ రోజు ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో గదికి కాఫీ ఎందుకు తీసుకొచ్చావు అంటాడు మురారి. మనం ప్రేమించేటప్పుడు నేను కన్న కలలు ఇప్పుడు నిజం చేసుకుంటాను అంటుంది ముకుంద. కృష్ణ చూస్తుంది అని మురారి అంటే అగ్రిమెంటు పూర్తి అవ్వగానే వెళ్ళిపోయే భార్య గురించి ఎందుకంత కంగారు పడతావు తను ఏమైనా పర్మినెంట్గా ఉండిపోవడానికి వచ్చిందా నాలాగా అంటుంది ముకుంద.  ఎవరైనా చూస్తే బాగోదు దయచేసి వెళ్ళిపో అంటాడు మురారి.

నా ప్రపంచమే నువ్వు అయినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచం ఏమనుకున్నా నాకు పర్వాలేదు ఇలా రోజు నేను నీకు కాఫీ ఇస్తాను కొసరి కొసరి తినిపిస్తాను.. ఇంకా చాలా చేస్తాను అంటూ కాఫీ ఇస్తుంది ముకుంద. కృష్ణ వచ్చేస్తుంది దయచేసి వెళ్ళిపో అంటాడు మురారి. నాకేమీ భయం లేదు నువ్వు కూడా ఎందుకంత భయపడతావు అంటుంది ముకుంద. సడన్గా అక్కడ కృష్ణ ని చూసి షాక్ అవుతారు మురారి, ముకుంద. నువ్వు కాఫీ తీసుకొచ్చావ్ ఏంటి అని కృష్ణ అడిగితే చిన్న అత్తయ్యకి బాగోలేదు అంటుంది ముకుంద.

నువ్వు కూడా త్వరగా రెడీ అయి కిందికి రా హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అంటుంది. హాస్పిటల్ అంటే గుర్తుకు వచ్చింది.. నాకు కెసిపి సర్ ఈ కోటు స్టెతస్కోప్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ చూపిస్తుంది కృష్ణ. మురారి వైపు కోపంగా చూస్తూ తను ప్యాకెట్ పట్టుకొని వస్తుంటే తన యూనిఫారం ఏమో అనుకున్నాను. పోనీలే యూనిఫామ్ తెచ్చి మంచి పని చేశాడు. ఇకపై వీటితోనే నీకు ఎక్కువ పని ఉంటుంది అంటూ మురారిని చూసుకుంటూ వెళ్ళిపోతుంది ముకుంద. కృష్ణ అమాయకత్వంతో నా కొంప ముంచుతుంది అనుకుంటాడు మురారి.

మరోవైపు వంట చేస్తున్న ముకుంద నాకు చెప్పేది ఒకటి అక్కడ చేస్తున్నది మరొకటి.. అగ్రిమెంట్ పూర్తి కాగానే వెళ్ళిపోతుంది అని సరిపెట్టుకుందాం అనుకున్నా, తనతో ఒక అమ్మాయి రూమ్ షేర్ చేసుకుందంటేనే కంపరంగా ఉంది పైగా ఆమెకి గిఫ్ట్లు కూడా ఇస్తున్నాడు. నాకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నేను దగ్గరికి వెళ్తేనే భయంతో వణికి పోతున్నాడు. పెళ్ళాం చూస్తే ఏమవుతుంది ఈరోజు నుంచి కృష్ణ హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది కాబట్టి మురారి కి నాకు స్వేచ్ఛ దొరుకుతుంది.

మురారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అనుకుంటుంది. మరోవైపు ముకుంద దగ్గరికి వచ్చిన కృష్ణ అత్తయ్యకు బాగోలేదన్నవు కదా ఏమైనా హెల్ప్ చేయనా అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తూ కూర్చుంటే మొదటి రోజే హాస్పిటల్కి లేట్ అవుతావు నీకు క్యారేజీ కట్టాను నువ్వు బయలుదేరు ఎలా వెళ్తావు డ్రైవర్ ఉన్నాడట అని అడుగుతుంది ముకుంద నేనే డ్రాప్ చేస్తాను అంటాడు మురారి ఆ మాటలకి ముఖం చిట్లించుకుంటుంది ముకుంద. కృష్ణని తొందరగా బయటికి పంపిస్తే నీతో ఏకాంతం దొరుకుతుందని వంట గబగబా చేశాను నువ్వు కూడా కృష్ణ వెనుక తోకలాగా వెళ్తావనుకోలేదు అనుకుంటుంది ముకుంద. సరే అంటూ బయలుదేరుతారు మురారి దంపతులు.

పెద్దత్తయ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు పని చేసినట్లు నటిస్తే అప్పుడు నాకు ప్లస్ కృష్ణకి మైనస్ అనుకుంటుంది ముకుంద. మరోవైపు ముకుంద అన్న మాటల్ని ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మురారి. ఒక కారుని గుద్దేయబోతూ కృష్ణ హెచ్చరించడంతో జస్ట్ మిస్ అవుతుంది యాక్సిడెంట్. నేను ఫస్ట్ టైం డాక్టర్ గా హాస్పిటల్లో అడుగుపెడదాం అనుకుంటున్నాను మీరు నన్ను పేషెంట్ లాగా అడుగు పెట్టించే లాగా ఉన్నారు అంటూ నవ్వుతుంది  కృష్ణ.

మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన భవాని ఇంకా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయలేదా ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంది. కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుందని ఆమెకి క్యారేజీ కట్టేసరికి లేట్ అయింది అంటూ అమాయకత్వం నటిస్తుంది ముకుంద. రేవతి ఏది అని అడిగితే తనకి బాగోలేదని టాబ్లెట్ వేసి పడుకుంది పనమ్మాయికి ఫోన్ చేస్తే రెండు రోజుల్లో వస్తానని చెప్పింది అంటుంది భవాని చిన్న తోటి కోడలు. రేవతికి ఒంట్లో బాగోకపోతే కృష్ణ తనక్ క్యారేజ్ తనే ప్రిపేర్ చేసుకోవాలి కదా అలా ఎలా ఇర్ రెస్పాన్సిబుల్గా వెళ్ళిపోతుంది అంటుంది భవాని. తను ఎప్పుడు వంటగదిలోకి అడుగుపెట్టలేదు కదా అని అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు.

ఇంట్లో ఇంత మంది ఉన్నారు కదా టైం కి బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఎలాగా అంటూ కేకలు వేస్తుంది భవాని. రేపటి నుంచి నేనే 5 గంటలకు లేచి వంట చేస్తాను అని ముకుందా అంటే నువ్వు ఒక్కదానివే ఈ ఇంటి కోడలు కాదు కదా సుమ అలేఖ్య కూడా ఈ ఇంటికోడల్లే కదా తినడానికి ముందు కూర్చోవడం తప్పితే ఏ పని చేతకాదు అంటూ కోప్పడుతుంది భవాని. ఎవరికి క్రమశిక్షణ లేకుండా పోతుంది కృష్ణ రానీ చెప్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భవాని.

కృష్ణ హౌస్ సర్జన్ పూర్తయ్యేసరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నేను మురారి ప్రేమ పక్షుల్లాగా హ్యాపీగా ఉండొచ్చు ఊహించుకుంటేనే ఇంత బాగుంది అనుకుంటూ మురారి కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి స్టేషన్ కి తీసుకు వెళ్లి ఇస్తాను అంటూ ఆ పనిలో పడుతుంది ముకుంద. మరోవైపు  ఆనందంగా హాస్పిటల్లోకి వెళ్తున్న కృష్ణని ఆపి నేను కూడా వస్తాను అంటాడు మురారి. పర్వాలేదు సార్ నేను వెళ్తాను అని కృష్ణ అంటే ఎలాగూ ఇంతవరకు వచ్చాను కదా ఒకసారి పరిమళాన్ని పలకరించి వెళ్తాను అంటాడు మురారి. మీరు వచ్చింది నాకోసం కాదా పరిమళ మేడం కోసమా అంటూ ఆట పట్టిస్తుంది కృష్ణ.

తనని నవ్వుతూ విష్ చెయ్యు అంటాడు మురారి. నవ్వితే ముఖంలో కండరాలు సాగుతాయి కానీ ఆవిడ నవ్వితే మొహం లో ఎలాంటి మార్పు  ఉండదు. అసలు ఆవిడ మొహంలో నవ్వే ఉండదు ఆవిడ మొహం బూడిద గుమ్మడికాయ లాగా ఉంటుంది అంటుంది కృష్ణ. ఈ మాటలు ఆవిడ వింటే నిన్ను అదే గుమ్మడికాయ లాగా వేలాడదీస్తుంది అంటాడు మురారి. పెళ్లయిన దగ్గర నుంచి నువ్వు ఇల్లు కదల్లేదు ఇప్పుడు కదలక తప్పడం లేదు నువ్వు ముక్కు సూటిగా వెళ్తావు అందరూ నాలాగా సర్దుకు పోలేరు.

సో నువ్వు అందరితో బాగుండాలి, అందరూ నీతో బాగుండేలాగా ప్రవర్తించాలి అంటూ జాగ్రత్తలు చెప్తాడు మురారి. నీ మాటలు జీవితకాలం గుర్తుంచుకుంటాను అంటుంది కృష్ణ. మురారి స్వయంగా ఆమెకి కోటు తగిలించి స్టెతస్కోప్ వేసి చూసుకొని మురిసిపోతాడు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిన ఈ జ్ఞాపకం నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకల నిజం కాబోతుంది ఇది మీ చేతులతో ఇచ్చారు మా నాన్నకి మాటిచ్చినట్లే మీకు కూడా మాటిస్తున్నాను వృత్తిని దైవంలాగా భావించి పేదలకు సేవ చేస్తాను. ఈ క్షణంలోని ఎప్పటికీ మర్చిపోను అంటుంది కృష్ణ.

ఆ మాటలకి ఆనందంతో అక్కడి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతాడు మురారి. మరోవైపు పరిమళ ఒక డాక్టర్ తో మీ అర్జున్ రెడ్డి వచ్చాడా అని అడుగుతుంది. మీరు గౌతమ్ గురించేనా అడుగుతున్నారు తాగి డ్యూటీ కి రాలేదు కదా అంటుంది పరిమళ. లేదు అని ఆ డాక్టర్ అంటే ఒక జూనియర్ డాక్టర్ని అతని టీం లో అపాయింట్ చేశాను నా ఫ్రెండ్ వైఫ్ అని చెప్తుంది పరిమళ. అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణ మార్నింగ్ మేం అంటుంది. గుడ్ మార్నింగ్ లో గుడ్డు ఏమైంది గుడ్డు మింగేసినట్టు మింగేసావా అంటుంది పరిమళ.

మార్నింగ్ లో గుడ్ చేరిస్తేనే గుడ్ విషెస్ అవుతుంది అంటుంది పరిమళ. అర్థమైంది మేడం అంటూ గుడ్ మార్నింగ్ చెప్తుంది కృష్ణ. లేట్ అయింది ఎందుకు అని పరిమళ అడిగితే నేనే ముందు వచ్చాను అంటుంది కృష్ణ. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నీకు ఎక్కడ డ్యూటీ వెయ్యాలో నాకు తెలుసు అంటూ మార్చరీలో డ్యూటీ వేస్తుంది పరిమళ. అమ్మో అక్కడ డ్యూటీ వేయకండి నాకు సేవలు అంటే చచ్చేంత భయము నాకు అక్కడ డ్యూటీ వెయొద్దు అంటూ కంగారుగా రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ.

గొడవ పెట్టకు నిన్ను గౌతమ్ అనే సీనియర్ డాక్టర్ టీం లో పెడుతున్నాను సంతకం పెట్టు అంటుంది పరిమళ. ఎక్కడ అని కృష్ణ అడిగితే చెక్కు మీద ఐదు లక్షల కి అంటూ వెటకారం ఆడుతుంది పరిమళ. పెన్ను కోసం వెతుకుతున్న కృష్ణని అడగొచ్చు కదా అంటూ పెన్నిచ్చి ఇంకొకసారి పెన్న మర్చిపోయి రావద్దు నా దగ్గర పిచ్చి వేషాలు వేసినట్లు గౌతమ్ దగ్గర వెయ్యకు అతను చాలా స్ట్రిక్ట్ అంటుంది పరిమళ. మీకన్నానా అనుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?